ట్రైన్ లో చైన్ పుల్ చేస్తే…ఏ భోగిలో లాగారు అని డ్రైవర్ కి ఎలా తెలుస్తుందంటే?

ట్రైన్ లో చైన్ పుల్ చేస్తే…ఏ భోగిలో లాగారు అని డ్రైవర్ కి ఎలా తెలుస్తుందంటే?

by Anudeep

Ads

ఒకసారి ముంబాయ్ టూర్ వెళ్లాం ప్రెండ్స్ అందరం..రిటర్న్ జర్నికి టికెట్స్ ఆల్రెడి రిజర్వేషన్ చేయించుకున్నాం..పది రోజుల టూర్ తర్వాత ముంబాయ్ లోని చత్రపతి టెర్మినల్ లో మద్యాహ్నం మూడు గంటలకి  ట్రెయిన్.. అందరం వచ్చేశాం..మరో ముగ్గురు రాలేదు..ఇంతలో ట్రెయిన్ బయల్దేరింది.ఏం చేయాలో పాలుపోక వెంటనే చెయిన్ లాగేశాను..ఆ ఐదు నిమిషాల గ్యాప్లో అయినా ఫ్రెండ్స్ రాకపోతారా, ట్రెయిన్ ఎక్కకపోతారా అనే చిన్న ఆశతో..వాళ్లు రాలేదు కాని టిటి, స్టేషన్ పోలీస్ వచ్చారు..ఫైన్ కట్టండి అంటూ..

Video Advertisement

సినిమాల్లో చూస్తుంటాం కదా ట్రెయిన్ లో చెయిన్ లాగాగానే టిటి వచ్చి ఫైన్ వేయడం.. అలాంటి అనుభవం మీకెప్పుడైనా ఎదురైందా.. మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు చెయిన్ లాగగానే ట్రెయిన్ కి అన్ని బోగిలు ఉంటాయి కదా..ఎవరు లాగారో అంత ఫర్ఫెక్ట్ గా ఎలా తెలుస్తుంది అని..ఈ అనుభవంతో నాకు డౌటొచ్చింది..అసలు నేనే లాగానని గ్యారంటీ ఏంటి.. అని దబాయించి అడగాలనిపించింది..బాగోదని ఊరుకున్నాను.. కాని ఆ డౌట్ మాత్రం అలాగే ఉండిపోయింది..ఇంతకీ చెయిన్ ఎవరు లాగారనేది ఎలా తెలుస్తుందో తెలుసా..

ట్రెయిన్లో చెయిన్ పుల్లింగ్ సిస్టం ఎలా పనిచేస్తుందంటే..ప్రతి కోచ్లో  రెండు కోచ్లకు మాత్రమే సంబంధించిన బ్రేక్ ఫైప్, ఫీడ్ పైప్ కనెక్ట్ అయిన దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఒక రోప్ వైర్ కి కనెక్ట్ చేసి ఉంటుంది..ప్యాసింజర్ ఎవరైనా చెయిన్ లాగగానే  బ్రేక్ పైప్లో ఉన్నటువంటి ఆ బ్రేక్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుండి ఆ బ్రేక్ పైప్ యొక్క ఎయిర్ ప్రెజర్ రిలీజ్ అవుతుంది.ఒకేసారి ట్రెయిన్ మొత్తానికి బ్రేక్ అప్లై అయి ట్రెయిన్ ఆగుతుంది..

ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా లోకోపైలట్ కి తెలుస్తుంది..అతడి దగ్గర ఒక అలారం మోగుతుంది.. అతడి దగ్గర ఉన్న ప్రెజర్ గేర్ ద్వారా ఆ ప్రెజర్ ని కంట్రేల్ చేసి, వెంటనే  రైల్వే పోలీస్, మరియు గార్డుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రెయిన్ ఆపుచేస్తారు. ఏ కోచ్ నుండి ప్రెజర్ రిలీజ్ అవుతుందో తెలుసుకుని ఆ కోచ్లో ఎవరు లాగారో అనేది తెలుసుకుంటారు.. చైన్ లాగగానే, ఏ బోగీ నుండి చైన్ లాగారో, ఆ  బోగీ దగ్గరకే రావడం వెనుక ఉన్న కథ ఇది.


End of Article

You may also like