Ads
ట్రూ కాలర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ యాప్ ని మన మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకి వచ్చే కాల్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఎవరైనా తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చినప్పుడు, మన కాంటాక్ట్స్ లో సేవ్ అవ్వని నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ట్రూ కాలర్ యాప్ సదరు వ్యక్తి పేరుని డిస్ప్లే చేస్తూ ఉంటుంది.
Video Advertisement
సదరు వ్యక్తికీ కూడా ట్రూ కాలర్ యాప్ ఉంటె లేదా.. అతని నెంబర్ ఇతర ట్రూ కాలర్ యాప్ యూజర్ల మొబైల్స్ లో సేవ్ అయ్యి ఉన్నా.. మనకి ఎవరు ఫోన్ చేసారు అన్న విషయం తెలిసి పోతూ ఉంటుంది.
అయితే, మీరెప్పుడైనా గమనించారా..? మీకు కాల్ రావడానికి ముందే ట్రూ కాలర్ నుంచి కాల్ వస్తున్నట్లు కనిపిస్తుంది. మొబైల్ లో కంటే ముందుగానే ట్రూ కాలర్ లో కాల్ రాబోతున్నట్లు ఎలా తెలుస్తుంది? ఆ విషయాన్నీ తెలుసుకునే ముందు ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచించండి.
మీరెప్పుడైనా ఓటీపీ లు ఎంటర్ చేసేటప్పుడు గమనించారా..? మనం వాడుతున్న అప్లికేషన్ పై ఓటీపీ వస్తుంది అన్న విషయం డిస్ప్లే అవ్వకముందే మన మొబైల్ కి ఓటీపీ వచ్చేస్తుంది. ఆటో మెసేజెస్ ఆప్షన్ ఉన్న వారికి ఆ ఓటీపీ ఎంటర్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఓటీపీ మెసేజ్ రాకముందే.. ఆ అప్లికేషన్ లో ఓటిటి ఎంటర్ అయిపోతూ ఉంటుంది.
ఇంటర్నెట్ నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ, సెల్యూలర్ నెట్ వర్క్ వేగంలో తేడాల కారణంగా ఇలా జరుగుతుంటుంది. అన్ని టెలికం కంపెనీల నెట్ వర్క్ లు స్థిరంగానే పని చేస్తాయి. ఇవి కాల్ కోసం 450 నుంచి 2700 MHZs ఫ్రీక్వెన్సీ ని ఉపయోగించుకుంటాయి. అదే అప్లికేషన్స్ విషయానికి వస్తే.. ఇవి -2 Hzs ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ తో పని చేస్తాయి. అదే సూత్రం ఫోన్ కాల్స్ కి కూడా వర్తిస్తుంది. అయితే ఈ సెల్యూలర్ వేగం తక్కువగా ఉంటె.. కాల్ లేటుగా వస్తుంది. కానీ ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ తో పని చేసే ట్రూ కాలర్ అప్లికేషన్ మాత్రం ఫోన్ కంటే ముందుగానే కాల్ వస్తున్నట్లు గుర్తిస్తుంది.
End of Article