సినిమాల్లో ఫుడ్ తింటున్న సీన్ లో నటిస్తున్నప్పుడు యాక్టర్లు ఎక్కువ టేక్ లు తీస్కోవాల్సి వస్తే ఎలా మేనేజ్ చేస్తారు..?

సినిమాల్లో ఫుడ్ తింటున్న సీన్ లో నటిస్తున్నప్పుడు యాక్టర్లు ఎక్కువ టేక్ లు తీస్కోవాల్సి వస్తే ఎలా మేనేజ్ చేస్తారు..?

by Anudeep

Ads

ఓ సినిమా ను షూట్ చెయ్యాలి అంటే అంత తేలిక ఏమి కాదు. ప్రతి పనికి, ప్రతి సీన్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉండాలి. అంతే కాదు ఆ స్క్రిప్ట్ కి తగ్గట్లే సినిమా రావాలి. ఆచరణ లో కానీ, షూటింగ్ లో కానీ ఏ చిన్న తేడా జరిగినా రీ షూట్ చేయాల్సి వస్తుంది. ఆ సీన్ కోసం అప్పటి వరకు పెట్టిన ఖర్చు కూడా వృధా అవుతుంది.

Video Advertisement

food scene 2

ఫుడ్ తింటున్నట్లు షూటింగ్ చేయడం కూడా ఒకరకం గా కష్టమే. ఎందుకంటే ఇడ్లిలు, చపాతీలు వంటివి తింటున్నట్లు పెడితే.. ఎక్కువ టేకులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫుడ్ ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమం లో అవసరమైన దానికంటే ఎక్కువ ఫుడ్ ని తెప్పించాల్సి ఉంటుంది. ఇది కాకుండా.. ఆ ఫుడ్ అన్ని షాట్ లలోనే ఒకేలా లేకపోతే ప్రేక్షకులకు తెలిసిపోతూ ఉంటుంది. ఇడ్లిలు, చపాతీలు లాంటి ఫుడ్ ఐటమ్స్ ని ఐతే మరింత ఈజీ గా గుర్తు పట్టేయచ్చు.

food scene 4

ఇక పిజ్జా, బర్గర్లు లాంటివి ఐతే.. అవసరమైన దానికంటే ఎక్కువే తెప్పించాలి. ప్రతి షాట్ లో అవి ఒకేలా కనిపించాలి. శివాజీ సినిమాలో ఫుడ్ సీన్ గుర్తుందా..? శ్రీయ ఫామిలీ.. రజినీకాంత్ ఇంటికి వచ్చినప్పుడు టేబుల్ నిండా ఫుడ్ తో నింపేస్తారు. ఇందుకోసం.. లే మెరిడియన్ హోటల్ నుండి 17,000 రూపాయల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేసారు. కానీ ఈ సీన్ లో ఎవ్వరూ రెండు స్పూన్ల ఆహరం కంటే ఎక్కువ తీసుకోలేదు. అక్కడ షూటింగ్ మొత్తం కామెడీ ట్రాక్ పైనే నడుస్తుంది.

food

ఈ సీన్ షూట్ అయ్యాక ఆ ఫుడ్ ని ఏమి చేసారో తెలుసా..? అక్కడ ఉండే టీం మెంబెర్స్ కి, స్పాట్ బాయ్స్ కి పంచేస్తారు. ఫుడ్ సీన్ లను ఎప్పుడు షూట్ చేయాలన్నా.. ఒక్క రోజులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అదే ఫుడ్ ను.. అదే క్వాంటిటీలో పెట్టలేకపోతే కంటిన్యూటీ సమస్య వస్తుంది. చపాతీలు, ఇడ్లిలు వంటివి రీప్లేస్ చేస్తే ఈజీ గా తెలిసిపోతుంటాయి. అందుకే చాలా సినిమాల్లో రైస్, కర్రీని వినియోగిస్తుంటారు. ఇవి క్వాంటిటీలో చేంజెస్ వచ్చినా పెద్దగా గుర్తించలేము.


End of Article

You may also like