మీ వెహికల్ కి ముందూ, వెనకా ఆ స్టిక్కర్స్ ఉన్నాయా..? అయితే వెంటనే తీసేయండి.. ఎందుకంటే..?

మీ వెహికల్ కి ముందూ, వెనకా ఆ స్టిక్కర్స్ ఉన్నాయా..? అయితే వెంటనే తీసేయండి.. ఎందుకంటే..?

by Anudeep

Ads

మనం కొత్తగా కొనుక్కున్న బైక్స్ లేదా కార్లపై దేవుడి స్టిక్కరులో, లేక మన పేరెంట్స్ లేదా మనకు ఇష్టమైన వారి పేర్ల స్టిక్కర్లనో అంటించుకోవడం సాధారణమే. కానీ, కొందరు ప్రెస్, పోలీస్, ఎమ్మెల్యే, GHMC, డాక్టర్, అడ్వకేట్ లాంటి స్టిక్కర్లను అంటించుకుంటూ ఉంటారు. వారు నిజంగా ఆ వర్గానికి చెందిన వారు అయితే ఇబ్బంది లేదు.

Video Advertisement

కానీ, కొందరు నకిలీ రాయుళ్లు కూడా ఇలాంటి స్టిక్కర్లను అంటించుకుని రోడ్డుపై విచ్చలవిడిగా తిరిగేస్తూ ఉంటారు. ప్రముఖ సంస్థల పేర్లను అడ్డం పెట్టుకుని తిరిగే ఇలాంటి నకిలీ రాయుళ్ల పని పట్టడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది.

ఇందుకోసం జంట నగరాల్లో పలు చోట్ల స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తోంది. ప్రముఖ కూడళ్లలో, నగరంలో ఏ వాహనం పైన అయినా ఇలాంటి స్టిక్కర్లు కనిపిస్తే.. వారిని ఆపి తనిఖీ చేయనున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి స్టిక్కర్లు పెట్టుకుని, ప్రముఖ ప్రభుత్వ సంస్థల పేర్లను అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగే తిరిగే వారు ఎక్కువ అవుతున్నారు.

ఈ క్రమంలో ఇక నుంచి ఎవరైనా ఇటువంటి స్టిక్కర్లు తమ వాహనాలపై ముందు లేదా వెనుక అంటించుకోవాలంటే వారితో పాటు సంబంధిత ఐడి కార్డు లేదా పర్సనల్ ఐడెంటిటీ ని క్యారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రముఖ కూడళ్ల వద్ద మొదలైన ఈ తనిఖీలను ఇకపై విస్తృతంగా చేపట్టనున్నారు. ఇటువంటి స్టిక్కర్లు అంటించుకున్న వారు విధిగా పోలీసులకు ఐడి కార్డును చూపించాల్సి ఉంటుంది.

ఎటువంటి పర్సనల్ లేదా ప్రొఫెషనల్ ఐడి కార్డు లేకుండా ఇటువంటి స్టిక్కర్లను అంటించుకుని తిరిగితే వారిపై యాక్షన్ తీసుకోనున్నారు. అటువంటి వాహనాలను సీజ్ చేయనున్నామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకోవడం కోసం పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. నకిలీ స్టిక్కర్లను అంటించుకుని వారి విషయంలో కూడా చర్యలు తీసుకోనున్నారు.


End of Article

You may also like