3.5 అడుగుల ఎత్తు…ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్న IAS ఆర్తి డోగ్రా రీయల్ లైఫ్ స్టోరీ..!

3.5 అడుగుల ఎత్తు…ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్న IAS ఆర్తి డోగ్రా రీయల్ లైఫ్ స్టోరీ..!

by Megha Varna

Ads

ఎప్పుడూ కూడా మనిషిని చూసి అంచనా వేయకూడదు. చాలా మంది మనిషిని చూసి వాళ్ళని వర్ణిస్తూ ఉంటారు. అయితే నిజంగా మనిషిని చూసి వెంటనే వాళ్ళని అంచనా వేయడం మంచి పద్ధతి కాదు. ప్రతీ ఒక్కరికీ కూడా జీవితంలో ఏదో ఒకరోజు అద్భుతం జరుగుతుంది.

Video Advertisement

పడిన శ్రమకి ఫలితం దక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేస్తూ.. అనుకున్నది సాధించాలి అని అనుకుంటే తప్పకుండా మంచి రోజు వస్తుంది. ఆ రోజు నిజంగా జీవితంలో మరచిపోలేనిది మరియు సక్సస్ అందుకున్న రోజులవుతుంది.

ఈమెహైట్ చూసి అంచనా వేస్తే నిజంగా పొరపాటు. ఎటువంటి భయం లేని ఐఏఎస్ ఆఫీసర్ ఈమె. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారు ఈమె. అయితే చాలా పొట్టిగా ఉంటారు కానీ గట్టివారే. ఈమె పేరు ఆర్తి డోగ్రా. చాలా మందికి ఈమె జీవితం ఆదర్శం అని చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈమెని వివిధ సందర్భాల్లో ప్రశంసించారు. అయితే ఈమె పుట్టుకతోనే డాక్టర్లు అందరిలాగ ఈమె మామూలు స్కూల్ కి వెళ్లి చదువుకో లేరు అని చెప్పారు.

కానీ అటువంటివి ఏమి ఆమెకి కాదు అన్నట్లు అనుకున్న దాని మీద ఫోకస్ చేసారు. ఆర్తి ఎంతో గుర్తింపు ఉన్న వెల్హమ్స్ స్కూల్ లో చదివారు. లేడీ శ్రీరామ్ కళాశాలలో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పొందారు. 2019 వ సంవత్సరం లో ప్రెసిడెంట్ రామ్ నాధ్ కోవింద్ ఆమెకి నేషనల్ అవార్డ్స్ ని అందించారు. ఆ తర్వాత ఆమె అజ్మీర్ లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా పోస్టింగ్ వచ్చింది.

రాజస్థాన్లో అసెంబ్లీ పోల్స్ జరుగుతున్నప్పుడు ఈమె చాలా ప్రధాన పాత్ర పోషించింది. డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్లకి వాహనాలను కూడా ఆమె ఇచ్చి ఓటు వేయడానికి ప్రోత్సహించింది. పదిహేడు వేల మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్లకి ఈమె వీల్ చైర్స్ ని కూడా అందించింది. అయితే ఈమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా ఎంతో పాజిటివ్ గా స్వీకరించి… కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు ఇంత ఘనత సాధించింది అంటే సాధారణ విషయం కాదు. ఇటువంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి తెలియాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని నడవాలి.


End of Article

You may also like