కోచింగ్ లేకుండా IAS..! ఇది ఎలా సాధ్యం..?

కోచింగ్ లేకుండా IAS..! ఇది ఎలా సాధ్యం..?

by kavitha

Ads

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ను ఇండియాలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పరిగణిస్తారు. ఇందులో విజయం సాధించడం చాలా క‌ష్ట‌మైన ప‌ని. ఈ పరీక్షలో విజయం సాధించడం కోసం చాలా మంది ఎంతగానో కష్టపడతారు. కోచింగ్ లకు వెళతారు. అయినప్పటికీ సివిల్స్ సాధించడానికి కొన్నేళ్ళు పడుతుంది.

Video Advertisement

అయితే ఒక యువతి మాత్రం ఎటువంటి కోచింగ్ కు వెళ్ళకుండానే, ఏకంగా ఐఏఎస్ జాబ్ ను సాధించింది. పట్టుదల, క‌సితో తన లక్షాన్ని సాధించిన ఆ యువతి ఎవరో? సివిల్స్ అభ్యర్థులకు ఆమె చెబుతున్న టిప్స్ ఏమిటో  ఇప్పుడు చూద్దాం..
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నివసించే దీక్షిత జోషి, 2022లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో  58వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, దీక్షితా సివిల్స్ ఎగ్జామ్ రాయడం కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. స్వయంగా సివిల్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయింది.
దీక్షితా జోషి తండ్రి ఫార్మసిస్ట్, తల్లి ఇంటర్ కళాశాలలో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆమె ఆర్యమాన్ విక్రమ్ బిర్లా పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. 12వ క్లాస్ లో ఉత్తీర్ణత పొందిన తరువాత జిబి పంత్ యూనివర్సిటీ పంత్‌నగర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత ఐఐటీ మండిలో మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ చేసే టైమ్ లోనే దీక్షిత యూపీఎస్సీ రాయాలని నిర్ణయించుకున్నారు. అయితే సివిల్స్ సాధించడం కోసం ఎలాంటి కోచింగ్ వెళ్ళలేదు. తానే ప్రిపేర్ అయ్యి, యూపీఎస్సీ పరీక్షలో 58వ ర్యాంక్ ను సాధించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సాధించడానికి దీక్షితా జోషి సివిల్స్ రాయబోయే అభ్యర్ధులకు కొన్ని చిట్కాలు చెప్పారు. లైఫ్ లో ఎప్పుడూ ఓటమికి భయపడకూడదని తెలిపారు. యూపీఎస్సీని సాధించాలంటే ఎటువంటి పరిస్థితులలోనూ ఏకాగ్రతను కోల్పోవద్దని చెప్పారు. ఎన్‌సిఇఆర్‌టి బుక్స్ నుండి నోట్స్ ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Also Read: ఇండియన్స్ ని తిట్టినందుకు…తన సత్తా ఏంటో చాటాడు..! హ్యాట్సాఫ్ బ్రదర్..!!!


End of Article

You may also like