Ads
మరణం ఆసన్నమైన సమయం లో ఎవరు మాట్లాడలేకపోతు ఉంటారు. వారేమైనా చెప్పాలనుకున్నా కొన్ని సార్లు చెప్పలేకపోతారు. నిశ్శబ్దం గా లోకాన్ని వీడి వెళ్లిపోతుంటారు. ఐతే మరణం దగ్గరకు వచ్చే వరకు.. ఈ సమయం లో ఎలా ఆలోచిస్తూ ఉంటాం అన్న విషయం ఎవరికీ తెలియదు. అసలు చనిపోయేముందు ఏమి జరుగుతుందో.. ఏ లక్షణాలను బట్టి వారు స్వర్గానికి వెళ్తారో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఎవరైనా మరణించే ముందు చిరునవ్వుతో ఉంటె.. వారు కచ్చితం గా స్వర్గానికే వెళ్తారు. మంచి పనులు చేసిన వారు ప్రశాంత చిత్తం గా ఈ లోకాన్ని వీడడానికి సిద్ధమైన వారు స్వర్గానికి వెళ్తారు. చేసిన పాపాలు గుర్తుకు వచ్చి భయపడేవారు నరకానికి వెళ్తారు. మరణాన్ని చూసి భయపడేవారు నరకానికి వెళ్తారు. గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించినపుడు వారిని తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. వారిని చూసి భయం తో శరీరం లో కింద భాగం కొంత జారుతుంది. ఆ సమయం లోనే కొందరు భయంతో మలమూత్రాదులు విసర్జిస్తుంటారు. ఇలా జరిగితే వారు నరకానికి వెళ్తారట.
ఎవరికైతే మలమూత్రాదులు కాకుండా.. ఆ రంధ్రాల నుంచి ఆత్మ బయటకు వస్తుందో వారు స్వర్గానికి వెళ్తారు. వీరికి యమదూతలు నల్లని వస్త్రాలలో, భయంకర రూపం లో కాకుండా పసుపు రంగు వస్త్రాలలో కనిపిస్తారు. మరణం ఆసన్నమయ్యే ముందు చూపు మందగించి పరిసరాలు కనిపించవని.. కేవలం యమదూతలు మాత్రమే కనిపిస్తారని అంటుంటారు. హిందూ సంప్రదాయం లో గంగాజలానికి, పవిత్ర తులసి జలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
మరణం ఆసన్నమయ్యే సమయం లో వీటిని నోట్లో పోయడం వలన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. కొన్నిసార్లు.. ఇది ఏర్పాటు చేయడం లో విఫలం అవుతూ ఉంటారు. దానికి మనం ఏమి చేయలేము. ఇది కేవలం నమ్మకం మాత్రమే. ఎవరైనా సంతృప్తి గా మరణిస్తే మాత్రం వారు కచ్చితం గా స్వర్గానికే వెళ్తారు.
End of Article