Ads
దేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే..అవి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఒకటి హిమాలయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దాగిన శంబాలా నగరం..ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వికులు చాలా మంది చెప్పేవారు. కాని ఎవ్వరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు.
Video Advertisement
అయితే హిమాలయాల్లోని ఈ ప్రాంతం లో మనం అడుగు పెట్టాలంటే అంత ఈజీ కాదు. ఎంతో సాధన చేస్తే కానీ మనకి ఆ ప్రాంతానికి ప్రవేశం దక్కదు. అదే షాంగ్రిలా ఆఫ్ శంబాలా. ఈ ప్రాంతం హిమాలయాల్లో ఉంది. కానీ మనం గూగుల్ మ్యాప్స్ లో దీనికోసం వెతికితే మనకి కనిపించదు. ఈ ప్రాంతం ఎంతో సుందరం గా, ఆహ్లదకరం గా ఉన్నట్లు ఇక్కడికి వెళ్ళినవారు చెప్పినట్లు చరిత్రలో ఉన్నాయి.
అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత ఈజీ కాదు. అక్కడికి వెళ్లాలంటే ముందుగా కైలాస పర్వతం పై 21 రోజులపాటు ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత 22 వ రోజు కొందరు ఋషులు వచ్చి ఒక గుహ లోపలి దారి గుండా మనల్ని ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. అయితే అక్కడికి చేరుకోవడానికి ముందు మనం మేక పాలని తాగాలట.
అయితే ఆ ప్రాంతం లో మనుషులు చిరంజీవులుగా ఉన్నారని కథలు ఉన్నాయి. అవి ఎంత వరకు నిజం అన్నది తెలీదు. అయితే పురాణాల ప్రకారం ఆంజనేయుడు మరణం లేకుండా హిమాలయాల్లో ఉన్నాడని ఉంది. అయితే ఆంజనేయుడు ఇదే ప్రాంతం లో సంచరిస్తున్నాడా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాగే ద్వాపరయుగానికి చెందిన అశ్వత్థామ కూడా చిరంజీవిగానే ఉన్నాడు.
శ్రీకృష్ణుడి శాపం కారణంగా అశ్వత్థామ నైమిశారణ్యంలో తిరుగుతుంటాడని అంటారు. అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిలో నమ్ముతారు. హిమాలయాల్లో గిరిజనులతో కలిసి జీవిస్తున్నాడనేది మరో కథనం. అలాగే రజనీకాంత్ బాబా సినిమాలో చూపించిన మహావతార్ బాబాజీ కూడా హిమాలయాలలో తిరుగుతుంటారని, ప్రయాగలో జరిగే కుంభమేళాకు వస్తుంటారని అంటుంటారు. మరి వీటి పై శాస్త్రీయ ఆధారాలు లేవు.
End of Article