ఐటి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు 80 సి లో క్లెయిమ్ చేస్తున్నారా? ఐతే ఈ తప్పులు చేయకండి..!

ఐటి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు 80 సి లో క్లెయిమ్ చేస్తున్నారా? ఐతే ఈ తప్పులు చేయకండి..!

by Anudeep

Ads

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయం పరిమితి కి మించితే, ప్రతి ఒక్కరు పన్ను చెల్లించాలన్న సంగతి తెలిసిందే. అయితే నెలసరి జీతం పైనే ఆధార పడే సగటు ఉద్యోగులు అదనపు ఖర్చులను తగ్గించుకోవడం తో పాటు.. ఈ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అని యోచిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వివరణలు కూడా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961లో ఇవ్వబడ్డాయి.

Video Advertisement

income tax 1

ఈ చట్టం లో పన్ను ను మినహాయించుకోవడం కోసం చట్టబద్ధమైన మార్గాల గురించి వివరించడం జరిగింది. వాటిల్లోనే సెక్షన్ 80 సి కూడా ఉంది. చాలా మంది ఈ సెక్షన్ కిందే పన్ను నుంచి మినహాయింపు పొందుతూ ఉంటారు. ఇందులోనే 80సిసిసి, 80సిసిడి (1), 80సిసిడి (1బి), 80 సిసిడి (2) పేర్లతో సబ్ సెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ సెక్షన్ల ప్రకారం పన్ను మినహాయించుకునే ఉద్యోగులు సహజంగా, తెలియకుండా చేసే పొరపాట్ల గురించి ఇప్పుడు చర్చిద్దాం.

income tax 3

ట్యూషన్ ఫీజులు:
చాలా మంది ట్యూషన్ ఫీజు తాలూకు రసీదులు చూపించి పన్ను మినహాయించుకుంటుంటారు. అయితే.. పూర్తి స్థాయి ఫీజులో ట్యూషన్ ఫీజు ఒక భాగం మాత్రమే. ఈ భాగం వరకే పన్ను ని డిడక్ట్ చేసుకోవాలి. అది కూడా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

లాక్-ఇన్ పీరియడ్ ను చూసుకోవాలి:
పన్ను మినహాయించుకునే వారు చాలా మంది పెట్టుబడుల లాక్-ఇన్ పీరియడ్ పరిమితులను పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకి పిపిఎఫ్ ను తీసుకుంటే ఇందులో పదిహేను సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అలానే ఫిక్సెడ్ డిపాజిట్ కి 5 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ పరిమితులను ఉల్లంఘిస్తూ డిడక్షన్ కి అప్లై చేస్తే.. ఆ వచ్చిన ఆదాయాన్ని ఆర్ధిక సంవత్సర ఆదాయం గా పరిగణిస్తారు. అంతే కాదు, ఆ ఆదాయానికి పన్ను కూడా కట్టాల్సి ఉంటుంది.

income tax 2

రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు:
గృహ బదిలీ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ ల పై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే.. వాణిజ్య ఆస్తులకు మాత్రం సెక్షన్ 80 సి వర్తించదు. అందుకే ఆస్తి సంబంధిత మినహాయింపు కొరేటప్పుడు ఆస్తి ఏ రకానికి చెందినదో చెప్పాల్సిన అవసరం ఉంది.

ఎండోమెంట్ బీమా పధకాలు:
చాలా మంది పన్నును ఆదా చేసుకోవడానికి ఎండోమెంట్ బీమా పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే వీటిల్లో వచ్చే ఆదాయం ఎక్కువ ఏమి ఉండదు. అందుకే, ఎండోమెంట్ బీమా లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ట‌ర్మ్ జీవిత బీమా తీసుకుంటే ఎక్కువ ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలసీ కి ప్రీమియం తక్కువ గా ఉంటుంది. ఇంకా మిగులు అమౌంట్ ను మరోదానిలో మదుపు చేసుకోవచ్చు.

income tax 4

రుణ చెల్లింపులు:
ఇంటి అప్పు ని తిరిగి చెల్లించేటప్పుడు కూడా పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. అయితే.. కొందరు ఇంటి కోసం ప్రైవేట్ లోన్ తీసుకుని దానికి కూడా పన్ను మినహాయింపు కోరుతూ ఉంటారు. ప్రైవేట్ లోన్ అంటే సన్నిహితులు లేదా బంధువుల వద్ద తీసుకున్న అప్పు. సెక్షన్ 80 సి నుంచి అప్పు కట్టటానికి పన్ను మినహాయింపు కోరాలి అంటే.. నేషనల్ హౌసింగ్ బ్యాంకు లు, కొన్ని సంస్థలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, బ్యాంకులు, LIC వంటి వాటి నుంచి మాత్రమే అప్పు తీసుకుని ఉండాలి. అందుకు తగిన డాక్యుమెంట్స్ ని కూడా సమర్పించాలి.

income tax 6

చివరగా, పన్ను ఆదా చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారు ఆర్ధిక సంవత్సరం చివరిదాకా ఆగడం కూడా మంచిది కాదు. ఆ టైం లో టైం సరిపోక ఏదో ఒక నిర్ణయం పై పెట్టుబడి పెట్టేస్తారు. దీనివల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. ముందు గా నిర్ణయం తీసుకుని, ఆచితూచి అడుగేయడం మంచిది.


End of Article

You may also like