ఇంగ్లాండ్ పై ఇండియా వన్ డే సిరీస్ కూడా గెలవడంపై ట్రెండ్ అవుతున్న 21 మీమ్స్…!

ఇంగ్లాండ్ పై ఇండియా వన్ డే సిరీస్ కూడా గెలవడంపై ట్రెండ్ అవుతున్న 21 మీమ్స్…!

by Mohana Priya

Ads

పూణే వేదికగా ఇంగ్లాండ్ జట్టుకి, టీం ఇండియాకి మధ్య ఆదివారం జరిగిన మూడవ వన్డేలో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు టీమిండియాని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దాంతో రోహిత్ శర్మ (37: 37 బంతుల్లో 6×4)తో కలిసి శిఖర్ ధావన్ (67: 56 బంతుల్లో 10×4) భారత్ ఇన్నింగ్స్‌ ని ప్రారంభించారు. మొదటి వికెట్ కి రోహిత్ శర్మతో కలిసి 14.4 ఓవర్లలో 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ తర్వాత అవుటయ్యారు.

Video Advertisement

తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (7), కేఎల్ రాహుల్ (7) చేయగా, ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (64: 44 బంతుల్లో 5×4, 4×6), రిషబ్ పంత్ (78: 62 బంతుల్లో 5×4, 4×6) జోడి ఐదవ వికెట్ కి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత కృనాల్ పాండ్యా (25: 34 బంతుల్లో), శార్ధూల్ ఠాకూర్ (30: 21 బంతుల్లో 1×4, 3×6) స్కోర్ చేయగా భువనేశ్వర్ కుమార్ (3), ప్రసీద్ కృష్ణ (0) స్కోర్ చేశారు. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు వికెట్లు, ఆదిల్‌ రషీద్‌ రెండు వికెట్లు, శామ్ కరన్ ఒక వికెట్, టాప్లే ఒక వికెట్, బెన్‌ స్టోక్స్ ఒక వికెట్, మొయిన్ అలీ ఒక వికెట్, లివింగ్ స్టోన్ ఒక వికెట్ పడగొట్టారు. టీం ఇండియా 329 పరుగుల స్కోర్ చేసింది.

ind vs eng 3rd odi trending memes

ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లు జేసన్ రాయ్ (14), జానీ బెయిర్‌‌స్టో (1) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన బెన్‌స్టోక్స్ (35)‌ని నటరాజన్‌ బోల్తా కొట్టించగా, మిడిల్ ఓవర్లలో డేవిడ్ మలాన్ (50: 50 బంతుల్లో 6×4) జట్టును మళ్లీ పోటీలోకి తీసుకెళ్లారు. చివరిలో ఆల్‌రౌండర్ శామ్ కరన్ (95 నాటౌట్: 83 బంతుల్లో 9×4, 3×6) స్కోర్ తో ఇంగ్లాండ్ జట్టుని దాదాపుగా గెలుపు వరకు తీసుకెళ్లారు. తర్వాత మార్క్ ‌వుడ్ (14: 21 బంతుల్లో 1X4) స్కోర్ తో రనౌట్ అయ్యారు అయ్యారు. భారత్ జట్టు బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టు 322/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22#23#24#25also check : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేసిన వియజయసాయి రెడ్డి


End of Article

You may also like