స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరవేయడంలో ఉన్న ఈ తేడా మీకు తెలుసా..?

స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరవేయడంలో ఉన్న ఈ తేడా మీకు తెలుసా..?

by Anudeep

Ads

మన భారతదేశం అంటేనే పండగలకు వేడుకలకు పెట్టింది పేరు. అవి మాత్రమే కాకుండా స్వతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని కూడా భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. స్కూల్స్, కాలేజెస్ అలాగే ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు.

Video Advertisement

difference between independence day and republic day

ఆ రోజు జరిగే వేడుకలని టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తారు. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా వేడుకలను అంత ఘనంగా జరుపుకోలేకపోయాం. ఈ రెండు వేడుకలలో జెండాలను ఎగురవేస్తారు. కానీ జండా ఎగరవేయడంలో తేడా ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు చేసే దాన్ని ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు. difference between independence day and republic day

గణతంత్ర దినోత్సవం రోజు చేసే దాన్ని ఫ్లాగ్ అన్ ఫర్లింగ్ అంటారు. ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటే జెండాని కింద నుంచి పైకి తీసుకు వచ్చి, తెరిచి ఎగరేస్తారు. అదే గణతంత్ర దినోత్సవం రోజు జెండా పైనే ఉంటుంది. కానీ ఆ జెండాని అన్ ఫర్ల్ చేస్తారు, అంటే తెరుస్తారు అంతే.

difference between independence day and republic day

స్వాతంత్ర దినోత్సవం రోజు అలా చేయడానికి కారణం ఏంటి అంటే, మనకి అప్పుడే స్వతంత్రం వచ్చింది. కాబట్టి మన దేశం అన్నీ అడ్డంకులను దాటి పైకి ఎదిగింది అనే దానికి సంకేతంగా అలా చేస్తారట. అదే గణతంత్ర దినోత్సవం విషయానికి వస్తే, అప్పటికీ మన దేశానికి స్వాతంత్రం వచ్చేసింది. కాబట్టి జెండా అనేది పైనే ఉంటుంది.


End of Article

You may also like