Ads
పెళ్లంటే మనసులు కలిసిన ఇద్దరు వ్యక్తుల్ని నిండు నూరేళ్ల పాటు కలిపి ఉంచే బంధం. అయితే పలు కారణాల వల్ల ఈ మధ్య చాలా జంటలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే విడాకులు అనేది వివాహానికి చట్టబద్ధమైన ముగింపు. వివాహ వ్యవస్థ పట్ల ఆలోచనలు మరియు నమ్మకాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి.
Video Advertisement
అయితే ఇలా విడిపోవాలి అనుకున్న జంటలకు హిందూ విడాకుల చట్టం ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. భారతదేశంలో ఇంతకు ముందు రోజుల్లో విడాకుల కేసులు చాలా తక్కువగా ఉండేవి. కానీ కాలంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణి కూడా మారిందని గమనించారు.
భాగస్వాములు వివాహాన్ని కొనసాగించలేమని భావిస్తే విడాకుల వైపు వెళ్లడానికి వెనుకాడరు. విడాకుల కేసులను పరిష్కరించేందుకు మరియు ఇరుపక్షాలకు న్యాయం చేయడానికి న్యాయస్థానాలు పలు నియమాలను తయారు చేసి ఉంచారు.
అయితే 1955 లో ఈ చట్టం వచ్చినప్పటి నుంచి పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో సవరణలు, మార్పులు చేసారు. అయితే ఈ ఏడాది వచ్చిన కొత్త నియమాలు ఏంటో చూద్దాం..
#1 ఇంతకు ముందు ఒక బంధం లో మోసపోయిన వారు మాత్రమే విడాకులకు అప్లై చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ బంధం లో ఉండలేము అని అనిపిస్తే ఇద్దరిలో ఎవరైనా అప్లై చేయవచ్చు.
#2 భాగస్వామి మానసికం గా, శారీరకంగా హింసిస్తే భరణం కోరడం తో పాటు, పిల్లల హక్కును కూడా వారికి ఇవ్వకూడదు.
#3 ఒక సంవత్సరం పాటు భాగస్వామిని, పిల్లలను పట్టించుకోకుండా వారి బాధ్యతలను విస్మరిస్తే విడాకులకు అప్లై చేయవచ్చు.
#4 భాగస్వామి లో ఏవైనా పెద్ద మార్పులు గుర్తిస్తే విడాకులకు అప్లై చెయ్యొచ్చు.
#5 ఏడాది పాటు దంపతులు విడిగా ఉంటే విడాకులకు అప్లై చెయ్యొచ్చు.
#6 అలాగే విడాకులు అప్లై చేసిన తర్వాత ఆరు నెలలు కలిసి ఉండాలన్న నిబంధన ఇప్పుడు లేదు.
#7 చాలా కాలం సహజీవనం లో ఉన్న జంటలో కూడా భరణం అడిగే హక్కు ఉంది.
Also Read: ఈ 5 ముఖ్య కారణాల వలనే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారట.? తప్పక తెలుసుకోండి.!!!
End of Article