ఎదురెదురుగా వస్తున్న రైళ్లు.. అయినా ఢీ కొట్టుకోవు.. రైల్వేలో కొత్తగా వచ్చిన “కవచ్” వ్యవస్థ ఎలా పని చేస్తుందో తెలుసా..?

ఎదురెదురుగా వస్తున్న రైళ్లు.. అయినా ఢీ కొట్టుకోవు.. రైల్వేలో కొత్తగా వచ్చిన “కవచ్” వ్యవస్థ ఎలా పని చేస్తుందో తెలుసా..?

by Anudeep

Ads

రైల్వే వ్యవస్థ చాలా పకడ్బందీగా పని చేస్తుంది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రాకుండా ఉండడానికి ట్రైన్ టైమింగ్స్ షెడ్యూల్ చేస్తూ ఉంటారు. అదీ కాకుండా.. ఏ రైలు ఎప్పుడు ఏ స్టేషన్ వద్ద ఏ ప్లాట్ ఫామ్ పై నుంచి వెళ్ళింది అన్న విషయాలను క్షుణ్ణంగానే పరిశీలిస్తూనే ఉంటారు.

Video Advertisement

అయినప్పటికీ.. ఒక్కొక్కసారి ఒకే ట్రాక్ పై రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొని ప్రమాదాలు జరిగిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. అయితే.. ఇటువంటి ప్రమాదాలను నివారించడం కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా “కవచ్” వ్యవస్థని తీసుకొచ్చింది.

రైల్వే లో “కవచ్” వ్యవస్థని అనుసంధానించిన రైలుని ఇటీవలే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. అసలు ఈ వ్యవస్థను ఎందుకు తీసుకు వచ్చారు..? ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది..? అన్న విషయాలను ఈరోజు ఆర్టికల్ లో తెలుసుకుందాం. రైల్వే యాక్సిడెంట్స్ ను సమూలంగా నిర్ములించాలన్న ఉద్దేశ్యంతోనే కవచ్ వ్యవస్థని తీసుకొచ్చారు.

వరల్డ్ సేఫ్టీ డే సందర్భంగా తెలంగాణాలో ఈ ప్రయోగాన్ని చేసారు. తక్కువ ఖర్చుతోనే కవచ్ వ్యవస్థని రూపొందించారు. ఈ వ్యవస్థని రైళ్ళకు అమరుస్తారు. ఒకేపట్టాలపై రెండు రైళ్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కవచ్ వ్యవస్థ ఉండడం వలన ఈ రైళ్లు ముందుగానే సిగ్నల్స్ ను గుర్తిస్తాయి. ఈరోజు ఈ ప్రయోగం చేసి చూడగా… రైల్వే ట్రాక్ పై వెళ్తున్న ఓ రైలు అదే పట్టాలపై మరో రైలు రావడం గుర్తించింది. ఈ రెండు రైళ్ళకి సిగ్నల్స్ అందడంతో అవి అక్కడే ఆగిపోయాయి.

హైదరాబాద్ లో సనత్‌నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రూట్‌లో ఈ ప్రయోగాన్ని చేసారు. ఒకే ట్రాక్ పై ఒక రైలు మరొక వైపు నుంచి ఇంజిన్ వచ్చేలా ప్రయోగం చేసారు. ఈ క్రమంలో రైళ్లు దగ్గరగా సమీపిస్తున్న టైం లోనే కవచ్ వ్యవస్థ ముందే గుర్తించి రైళ్లని ఆపేసింది. ట్రైన్స్ ఆగిపోయాక వాటి మధ్య దూరం 340 మీటర్లు ఉంది. రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చినా.. అవి గుద్దుకోకుండా కవచ్ వ్యవస్థ కాపాడుతుంది. ఈ సిస్టం ను ట్రైన్ కొల్లిజన్ ఎవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) లేదా ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ATP) అని పేర్కొంటారు. సిస్టం లో ఏదైనా లోపాలు ఉన్నా, రైలు అనుకోకుండా రెడ్ సిగ్నల్ ను దాటేసినా, దానంతట అదే ఆగిపోయేలా ఈ వ్యవస్థని రూపొందించారు. ఈ వ్యవస్థకు సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 (SIL4 ) సర్టిఫికెట్ కూడా ఉండడం విశేషం.

Watch Video:


End of Article

You may also like