మన దేశంలోని అత్యంత ధనవంతులైన ఈ 11 మంది ఇళ్ల ధరలు ఎంతో తెలుసా.? వాటి ప్రత్యేకతలు ఏంటంటే.?

మన దేశంలోని అత్యంత ధనవంతులైన ఈ 11 మంది ఇళ్ల ధరలు ఎంతో తెలుసా.? వాటి ప్రత్యేకతలు ఏంటంటే.?

by Mohana Priya

Ads

మన దేశంలో అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో కొంత మంది పేర్లు అయినా మన అందరికీ తెలిసే ఉంటాయి. వాళ్లు ఉండే ఇళ్లను కూడా వారికి కావలసిన వాటి కోసం సరిపోయే డబ్బులు ఖర్చు చేసి రూపొందించుకున్నారు. అలా మన దేశంలోని కొంత మంది సంపన్నుల ఇళ్ల ఖరీదు ఎంతో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 ఆంటిలియా – ముఖేష్ అంబానీ

అసలు “మన దేశంలోని సంపన్నులు” అనే పేరు వినగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఇంటి పేరు ఆంటిలియా. ఆంటిలియా భారతదేశంలోని అతి ఖరీదైన ప్రాపర్టీ. ఆంటిలియాను చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్స్ పెర్కిన్స్ మరియు విల్ రూపొందించారు.

Also Read: టీ కప్పు 3 లక్షలు…ఫోన్ 311 కోట్లు.! నీతా అంబానీ లైఫ్ స్టైల్ గురించి ఈ విషయాలు తెలుస్తే నోరెళ్లబెడతారు.!

ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాణ సంస్థ లైటన్ హోల్డింగ్స్ దాని నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు. ఇందులో 27 అంతస్థులు ఉంటాయి.ఆంటిలియాలో సెలూన్, థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఐస్ క్రీమ్ పార్లర్ ఇంకా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఆంటిలియా ఖరీదు 12,000 కోట్లు.

#2 జెకే హౌస్ – గౌతమ్ సంఘానియా

ఆంటిలియా తర్వాత భారత దేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ బిల్డింగ్ సౌత్ ముంబైలో ఉన్న జెకే హౌస్. దీని విస్తీర్ణం 16,000 చదరపు అడుగులు. ఇందులో కూడా స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా తో పాటు హెలిప్యాడ్ కూడా ఉంది. దీని ఖరీదు సుమారు 6000 కోట్ల రూపాయలు ఉంటుందట.

 

#3 అబోడ్ – అనిల్ అంబానీ

అనిల్ అంబానీ ఇల్లు అబోడ్ విస్తీర్ణం 16,000 చదరపు అడుగులు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం అనిల్ అంబానీ ఇంటి ఖరీదు 5000 కోట్ల రూపాయలు ఉంటుంది.

#4 జతియా హౌస్ – కుమార్ మంగళం బిర్లా

దీని విస్తీర్ణం 30,000 చదరపు అడుగులు. సినిమాల్లో చూపించినట్టు ఈ ఇంటి చుట్టూ నీళ్లు, గడ్డి ఉంటాయి. ఈ ఇంట్లో ఈ 20 బెడ్ రూమ్స్ ఉన్నాయి. వాల్ క్లాడింగ్, సీలింగ్ బర్మా టేకువుడ్ తో తయారు చేశారు. ఈ ఇంటిని కెఎమ్ బిర్లా 425 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.

#5 లింకన్ హౌస్ – సైరస్ పూనావాలా

భారతదేశ ఫార్మా దిగ్గజం సైరస్ పూనావాలా, 1957 లో యు.ఎస్. కాన్సులేట్ గా ఉపయోగించబడిన , తర్వాత లింకన్ హౌస్ గా పేరు మార్చబడిన భవనాన్ని 750 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు.

 

#6 మన్నత్ – షారుక్ ఖాన్

ముంబైలోని షారుక్ ఖాన్ నివాసం మన్నత్ ఖరీదు 200 కోట్ల రూపాయలు.

 

#7 జిందాల్ హౌస్ – సజ్జన్ జిందాల్

మూడంతస్తుల ఈ ఇంటిని సజ్జన్ జిందాల్ 400 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.

 

#8 రుయా హౌస్ – రవి రూయా

ఎస్సార్ గ్రూప్ అధినేతలు అయిన రవి రూయా, శశి రూయా ఇంటి ఖరీదు 120 కోట్ల రూపాయలు.

 

#9 స్కై హౌస్ – విజయ్ మాల్యా

స్కై హౌస్ గా పిలవబడే విజయ్ మాల్యా ఇంటి ఖరీదు దాదాపు 100 కోట్లు ఉంటుందట.

 

#10 జిందాల్ హౌస్ (ఢిల్లీ) – నవీన్ జిందాల్

జిందాల్ సోదరులలో ఒకరైన నవీన్ జిందాల్ ఇంటి విలువ 120 – 150 కోట్ల వరకు ఉంటుంది.

 

#11 రిటైర్మెంట్ హోమ్ – రతన్ టాటా

రతన్ టాటా 2008 లో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంటిని రిటైర్మెంట్ హోమ్ అని పిలుస్తారు. దీని ఖరీదు 150 కోట్ల రూపాయలు.

 


End of Article

You may also like