టీ కప్పు 3 లక్షలు…ఫోన్ 311 కోట్లు.! నీతా అంబానీ లైఫ్ స్టైల్ గురించి ఈ విషయాలు తెలుస్తే నోరెళ్లబెడతారు.!

టీ కప్పు 3 లక్షలు…ఫోన్ 311 కోట్లు.! నీతా అంబానీ లైఫ్ స్టైల్ గురించి ఈ విషయాలు తెలుస్తే నోరెళ్లబెడతారు.!

by Anudeep

Ads

ప్రపంచ కుబేరుల స్థానం లో చోటు దక్కించుకున్న ముకేశ్ అంబానీ గురించి తెలియని వారు భారత్ లోనే ఉండరు. అయితే, అంతటి ధనికుని భార్య కు ఏ రేంజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. కేవలం ముకేశ్ అంబానీ భార్య గానే కాకుండా, ప్రముఖ వ్యాపార వేత్త గా కూడా నీతా అంబానీ ఎదిగారు. అందుకే ఆమె ఫోర్బ్స్ మ్యాగజైన్ లో స్థానం సంపాదించుకోగలిగారు. సాక్షాత్తు ఫోర్బ్స్ కూడా నీతా అంబానీ సాధించిన ఘన విజయాలను ప్రత్యేకం గా ప్రశంసించడం విశేషం. ఆమె ఎంత ధనికురాలో, ఆమె లైఫ్ స్టైల్ ను కూడా అందుకు తగ్గట్లు గానే డిజైన్ చేసుకుంది. ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరం గా ఉంటాయి.

Video Advertisement

భారత్ లో ఉదయాన్నే టీ లేదా కాఫీ తో మన రోజును మొదలుపెడతాం. నీతా అంబానీ కూడా టీ తాగడం తో ఆమె దిన చర్యను ప్రారంభిస్తారు. అయితే.. అక్కడే ఆమె రేంజ్ కూడా కనిపిస్తుంది. ఆమె టీ తాగే కప్పు మూడు లక్షల రూపాయలు ఉంటుందట. షాక్ అయ్యారా.. ఈ కప్పులను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారట. వీటి పై బంగారు పూత తో ప్రత్యేకం గా డిజైన్ చేశారట. ఒక కప్పు విలువ మూడున్నర లక్షలట. మొత్తం కప్పు విలువ కోటిన్నర పైమాటే ఉంటుందట.

 

నీతా అంబానీ కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటారట. ఉదయాన్నే మొలకలు ఆహరం గా తీసుకోవడానికి ఇష్టపడతారు. అందరు మహిళల్లాగే నీతా కు కూడా బంగారు ఆభరణాలు అంటే ఎంతో ఇష్టమట. ఎక్కువ గా వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలను ధరించడాన్ని నీతా ఇష్టపడతారట. ఆభరణాలు ఏవి ఎలా ఉన్నా, ఆమె చేతికి ఉండే డైమండ్ రింగ్ అంటే నీతా కు ఎంతో ఇష్టమట. ముకేశ్ అంబానీ ఆ డైమండ్ రింగ్ ను ప్రేమను తెలుపుతూ ఇచ్చిన మొదటి గిఫ్ట్ అట.

నీతా పుట్టిన రోజు వచ్చినప్పుడల్లా, ముకేశ్ ప్రత్యేక బహుమానాలు ఇస్తూ ఉంటారట. అలా, నీతా 44 వ పుట్టినరోజున ముకేశ్ అంబానీ ఓ ప్రైవేట్ జెట్ ను నీతా కు కానుక గా ఇచ్చారట. దీని విలువ 402 కోట్ల రూపాయలు. అలాగే, నీతా ప్రపంచ వ్యాప్తం గా డిమాండ్ ఉన్న టాప్ బ్రాండెడ్ బాగ్ లను, చెప్పులను మాత్రమే వాడతారు.

ఆమె వాడే చెప్పులు, క్లిప్స్ ఇలా ప్రతి దాని విలువ మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటుంది. ఆమె హ్యాండ్ బాగ్స్ కనీసం ఐదు లక్షల నుంచి కోటిన్నర రూపాయల వరకు ఉంటాయట. అలాగే, దుస్తులను, చెప్పులను ఆమె ఒకసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకోడానికి ఇష్టపడరట. అయితే, ఏమైనా మ్యాచ్ అయ్యేవి ఉంటె వాటిని మాత్రం ఉంచుకుంటారట. నీతా ఫాల్కన్ సూపర్ నోవ ఐఫోన్ 6 ను ఉపయోగిస్తున్నారు. దీని ఖరీదు 311 కోట్ల రూపాయలు. ఈ ఫోన్ వెనుకాల పింక్ డైమండ్ ఉంటుంది. ఇది చాలా అరుదైన వజ్రం. అందుకే ఈ ఫోన్ అంత కాస్ట్ ఉంటుంది. అంతేకాదు నీతా అంబానీ గారు వాడే లిప్ స్టిక్ ధర 40 లక్షలు.

రోల్స్ రాయిస్, మెర్సిడెజ్, లాంటి కార్లు ఉన్నాయి. అయినప్పటికీ నీతా మెబాచ్ 62 కార్ ను ఎక్కువ గా ఉపయోగిస్తారట. ఈ కారుని ముఖేష్ అంబానీ నీతా యాభై వ పుట్టినరోజు బహుమానం గా ఇచ్చాడట. ఈ కారు ధర సుమారు పది కోట్లు ఉంటుంది.


End of Article

You may also like