కోడిగుడ్డు పెంకులతో లక్షలు సంపాదిస్తున్న మహిళలు..! ఎక్కడంటే..?

కోడిగుడ్డు పెంకులతో లక్షలు సంపాదిస్తున్న మహిళలు..! ఎక్కడంటే..?

by Anudeep

Ads

మనకు ఎందుకు పనికిరావు అనుకున్న వస్తువులే మనకు ఒక్కోసారి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ పనికిరాని వస్తువులు మనకు ఎంతో లాభాలను అందిస్తాయి. అందరూ  కోడుగుడ్డు గురించి వినే ఉంటారు . అనేక విధాలుగా కోడిగుడ్డును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. లోపల ఉన్న మిశ్రమాన్ని ఉపయోగించుకొని బయట ఉన్న పెంకులను పడేస్తుంటాం. లేదా మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తాం.

Video Advertisement

మరి ఇలా నిరుపయోగంగా పడేస్తున్న పెంకులతో లక్షలు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు ఈ మహిళలు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా.. ఆ విశేషాలు ఏమిటో మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

చత్తీస్ ఘడ్ లోని సర్గుజా జిల్లాకి చెందిన ఈ మహిళలు అంబికా మున్సిపల్ కార్పొరేషన్ సహాయంతో ఒక అడుగు ముందుకు వేసి లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. నిరుపయోగంగా పడివేసే కోడిగుడ్డు పెంకులతో ఒక మార్గాన్ని ఎంచుకుని ఏడాదికి లక్షల్లో సంపాదన ఆర్జిస్తున్నారు.

సర్గుజా జిల్లా కలెక్టర్ రీతూ సేన్ మహిళల సాధికారత అవసరాన్ని ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా మహిళల అభివృద్ధి కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. స్వయం ఉపాధి సహకార సంఘాల సాయంతో మహిళలకు ఆసరాగా ఉపాధి కల్పిస్తున్నారు. గుడ్డు పెంకులు నుంచి కాలుష్యం పౌడర్ మరియు ఎరువులు తయారు చేసే విధంగా పర్యావరణవేత్త సి. శ్రీనివాసన్ తో శిక్షణ అవగాహన కల్పించారు.  కాల్షియమ్ పౌడర్ ను తయారు చేయడానికి ముందు కోడిగుడ్డు పెంకులు నీటిలో కడిగి ఎండలో ఎండబెడతారు. ఆ తర్వాత ఈ గుడ్డు పెంకులను మెత్తని పొడిగా దంచుతారు.

 

దంచిన ఈ పొడిని జల్లెడతో జల్లించగా వచ్చిన ఈ పౌడర్ని కిలోల చొప్పున ప్యాకింగ్  చేస్తారు. పౌడర్ దాదాపు ఒక కిలో 100 నుంచి 500  వరకు పలుకుతోంది. ఇక్కడ మహిళలు నెలకి 50 నుండి 60 కేజీల కోడిగుడ్డు పెంకుల పౌడర్ ని తయారు చేస్తారు. ఇలా చేయడం ద్వారా వీరు నెలకి 12 వేల నుంచి 36వేల వరకు ఆదాయం లభిస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపు 4 లక్షల వరకు సంపాదనను ఆర్జిస్తున్నారు. అంతే కాకుండా ఉపాధి అవకాశాలు ఎలా ఏర్పరుచుకోవాలి అనుకునేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Source: https://telugustop.com/peeling-an-egg-they-are-earning-lakhs-with-it


End of Article

You may also like