21 ఏళ్ల వయసులోనే దేశంకోసం పోరాడి ప్రాణాలర్పించిన “ప్రీతి లత”…చరిత్ర మరచిన స్వాతంత్ర సమరయోధురాలు!

21 ఏళ్ల వయసులోనే దేశంకోసం పోరాడి ప్రాణాలర్పించిన “ప్రీతి లత”…చరిత్ర మరచిన స్వాతంత్ర సమరయోధురాలు!

by Mohana Priya

Ads

భారతదేశంలోనే కాకుండా తన స్వస్థలమైన బెంగాల్లో కూడా అంతగా తెలియని స్వాతంత్ర సమరయోధురాలు ప్రీతి లతా  వడ్డేదార్. తాను బతికి ఉన్న కొంత కాలం కూడా బ్రిటిష్ పరిపాలన పై యుద్ధం సాగించింది.ప్రీతి లతా తన చిన్నతనం మొత్తం తన సొంత ఊరు చిట్టగాంగ్ లో గడిపింది. తను ఢాకా లోని ఈడెన్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు బ్రిటిష్ పై వ్యతిరేక భావాలు మరింత పెరిగాయి. మెల్లగా అక్కడ చదువుతున్న మహిళా విప్లవకారులతో పరిచయం పెంచుకుంది. వారిలో అక్కడే చదువుకుంటూ సుభాష్ చంద్రబోస్ కి సహాయకురాలిగా ఉన్న లీల నాగ్ ఒకరు. లీల మహిళలకు పోరాట శిక్షణ ఇచ్చే దీపాలి అనే సంఘాన్ని స్థాపించారు.

Video Advertisement

ప్రీతి లతా పై చదువుల కోసం కలకత్తా కి వచ్చింది. అక్కడ కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని బెతున్ కాలేజీలో ఫిలాసఫీ విద్యార్థిగా చేరింది. ఆ నగరంలోని విప్లవకారుడు అయిన సూర్యసేన్ తో పరిచయం ఏర్పడింది. సహచరులు అతనిని మాస్టర్ దా అని పిలుస్తారు. సూర్య సేన్ ప్రేరణతో ప్రీతి లతా అతని గ్రూప్ లో చేరింది. 1930 నుండి వచ్చిన వార్తల ప్రకారం, మొదట ప్రీతి లతా ని సూర్య సీన్ గ్రూప్ లో ఉన్న సభ్యులు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎంతో వ్యతిరేకత వ్యక్తం చేశారు కానీ తర్వాత ఆమెకి దేశం పట్ల ఉన్న భక్తిని, పోలీసులకు తెలియకుండా గ్రూప్ పనులు నిర్వహించడంలో తనకి ఉన్న తెలివిని చూసి తర్వాత ఆమెను వ్యతిరేకించి చేసిన తప్పుకు  వారు పశ్చాత్తాప పడ్డారు.

1930లో ఆర్మీ దాడుల సమయంలో బ్రిటిష్ దళాలు మీద దాడి చేసి వాళ్ళ టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ లైన్లను నాశనం చేసే  మిషన్ లో ప్రీతి లతా పాల్గొంది. ఈ బృందంలోని కొంతమంది సభ్యులను బంధించి అరెస్టు చేయగా, ప్రీతి లతా మరియు మరికొందరు తప్పించుకొని తిరిగి కొద్ది నెలల తర్వాత కలిశారు. 1932 లో, సూర్య సేన్ యొక్క ప్రణాళికలను అనుసరించి చిట్టగాంగ్‌లోని పహర్తాలి యూరోపియన్ క్లబ్‌పై దాడి చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మిషన్ కి ప్రీతి లతా ను నాయకురాలిగా నియమించారు.

ప్రీతి లత నాయకత్వంలో, 10 మంది బృందానికి ఆయుధాల వాడకంపై శిక్షణ ఇవ్వబడింది. అవసరమైతే పొటాషియం సైనైడ్ తినాలి అనేది కూడా ఆ శిక్షణలో నేర్పించిన సూత్రాలలో ఒకటి . వారు సెప్టెంబర్ 23, 1932 రాత్రి క్లబ్‌పై దాడి చేశారు. క్లబ్‌లోని పలువురు గాయపడ్డారు, క్లబ్‌ను కాపలాగా ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు. ప్రీతి లతా కి బుల్లెట్ తగిలింది, తనతో పాటు వచ్చిన బృందంలోని మిగిలిన సభ్యులు తప్పించుకున్నా తను మాత్రం బుల్లెట్ గాయాన్ని లెక్కచేయకుండా, పారిపోకుండా ధైర్యంగా నిలబడింది. పోలీసుల అరెస్టు నుండి తప్పించుకోవడానికి ఆమె పొటాషియం సైనైడ్ తినేసి తన జీవితాన్ని ముగించింది. అప్పటికి ప్రీతి లత వయసు 21 సంవత్సరాలు మాత్రమే .

తాను చదువుతున్న బెతున్ కాలేజ్ బ్రిటిష్ అధికారుల ఆధ్వర్యంలో ఉండటంతో తన డిగ్రీని తిరస్కరించారు ప్రీతి లతా. తన మరణానంతరం దాదాపు 80 ఏళ్ల తర్వాత 2012లో బెతున్ కాలేజ్ డిస్టింక్షన్ తో డిగ్రీని ప్రధానం చేసింది. తన సర్టిఫికెట్లో పేరు తప్పుగా ఉంటుంది. ప్రీతి లతా వడ్డేదార్ అయిన తన పేరును ప్రీతి లతా వద్దర్ అని రాసి ఉంటుంది.

కోల్‌కతాలో ఉన్నా మైదాన్ లో స్వాతంత్ర్య సంగ్రామం లో ఉన్న వ్యక్తుల విగ్రహాలు ఉంటాయి. 1947 మరియు 1983 మధ్య ఈస్టిండియా కంపెనీ లో పనిచేసిన ఉద్యోగుల విగ్రహాలు, అలాగే బ్రిటిష్ పై వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుల విగ్రహాలను స్థాపించారు. అలా ఒక విగ్రహం ప్రీతి లతా పేరుమీద కూడా స్థాపించారు. కానీ ఆ విగ్రహం కింద ఎటువంటి పేరు అలా ఒక విగ్రహం ప్రీతి లతా పేరుమీద కూడా స్థాపించారు. కానీ ఆ విగ్రహం కింద ఎటువంటి పేరు లేదా వేరే వివరాలు ఉండవు.

ఇందిరా గాంధీ విగ్రహం దాటిన తర్వాత ఖాదీ  చీర ధరించి ఒక చేతిని చాచి మరో చేయి పైకెత్తి పిడికిలి బిగించి ఉన్న పొడవైన విగ్రహం ప్రీతి లతా ది. ఒక్కసారి ప్రీతి లతా గురించి చదివిన తర్వాత అంత చిన్న వయసులో తాను చేసిన త్యాగాన్ని ఎవరు అభినందించకుండా ఉండలేరు. అలాంటి వ్యక్తికి తగిన గౌరవం లభించకపోవడం విచారించాల్సిన విషయం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే తన స్వస్థలం లో కూడా తను చేసిన కృషిని గుర్తించకపోవడం.

 


End of Article

You may also like