Ads
భారత దేశంలో అతి పెద్ద రవాణా సంస్థలలో ఇండియన్ రైల్వే ఒకటి. ఇది ప్రభుత్వ పరిధిలోనే నడుస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో నడిచిన రైళ్లన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే నడిచాయి. తాజాగా.. ఇండియాలో మొట్ట మొదటిసారిగా ప్రైవేట్ ట్రైన్ అందుబాటులోకి వస్తోంది.
Video Advertisement
ఈ ట్రైన్ గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైళ్లను సౌత్ స్టార్ రైల్ అనే సంస్థ నడుపుతుంది. ఈ ట్రైన్ లో ట్రైనింగ్ ఇవ్వబడిన కీపర్స్ ఉంటారు. వీరు ట్రైన్ ను మధ్య మధ్యలో శుభ్రం చేస్తుంటారు.
ప్రత్యేకమైన షెఫ్ లతో వండించిన వెజిటేబుల్ వంటకాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్స్ లోనే శిక్షణ పొందిన ఓ వైద్యుడు, వైద్య సహాయకులు ఉంటారు. ట్రైన్ లో ఏదైనా అత్యవసరమైన పరిస్థితిలో వీరు చికిత్స అందిస్తారు. తిరుపూర్ నుంచి షిరిడి వెళ్ళు మార్గంలో ఈ ట్రైన్ అందుబాటులోకి రాబోతోంది.
రెగ్యులర్ ఇండియన్ రైళ్ళకి ఏవిధమైన చార్జీలు వసూలు చేస్తారో.. ఈ రైళ్లకు కూడా అదే చార్జీలు ఉంటాయని తెలుస్తోంది. రైలు బోగీలలో స్పీకర్లు ఉంటాయి. రేడియో జాకీ అందుబాటులో ఉంచారు. జర్నీ లో ప్రయాణికుల కోసం భక్తిగీతాలు, లైవ్ ఇంటర్వ్యూలు, స్పిరిట్యుయల్ స్టోరీస్ ను ప్రసారం చేయనున్నారు.
End of Article