పిల్లలను చదివిస్తే ఇన్ని ఇబ్బందులా..? ఓ తండ్రి ఆవేదనను చాటి చెప్పే ఈ స్టోరీ చదివితే కళ్ళు చెమరుస్తాయ్..!

పిల్లలను చదివిస్తే ఇన్ని ఇబ్బందులా..? ఓ తండ్రి ఆవేదనను చాటి చెప్పే ఈ స్టోరీ చదివితే కళ్ళు చెమరుస్తాయ్..!

by Anudeep

Ads

పిల్లలకోసం తల్లి తండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తుంటారో లెక్క లేదు. పిల్లలను కనడం, పెద్ద చేయడం, వారిని చదివించడం.. ప్రతి విషయం లోను తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప పిల్లలు పూర్తిగా తమ కాళ్లపై తాము నిలబడలేరు. అయితే.. ఇంత కష్టపడి చదివించక.. ఆ పిల్లలు వారి స్వార్ధానికి తల్లితండ్రులను వాడుకుంటూ ఉంటారు. ఇలా చెప్పడానికి ఈ స్టోరీనే ఉదాహరణ.

Video Advertisement

father 1

కర్ణాటకకు చెందిన మృత్యుంజయ, కృష్ణ కుమారి అనే భార్యాభర్తలకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి పిల్లలని పెంచి, ఉన్నత చదువులు చదివించారు. కూతురు కి ఆస్ట్రేలియా లో సెటిల్ అయిన ఓ సంబంధం చూసి వివాహం చేసారు. కూతురు కూడా చక్కగా చదువుకుని ఆస్ట్రేలియా లో మంచి జాబ్ చేస్తూ, భర్త తో హ్యాపీ గా ఉంది. మరో వైపు కొడుకు కూడా చెన్నై లో జాబ్ తెచ్చుకుని.. తన భార్య తో హ్యాపీ గానే ఉన్నాడు.

father 4

అంతా బాగుంది అనుకుంటున్న టైమ్ లో.. కూతురు ఫోన్ చేసింది. తనకు పాపను చూసుకోవడానికి ఇబ్బంది గా ఉందని.. తల్లితండ్రులు ఇద్దరు ఆస్ట్రేలియా కి రావాలని కోరింది. అయితే.. తాను ఆస్ట్రేలియా కు రాలేను అంటూ ఆ తండ్రి చెప్పి చూసాడు. కానీ, ఇద్దరం జాబ్ చేస్తూ..పాపను చూసుకోవడం కష్టం గా ఉంది.. కనీసం తల్లిని అయినా పంపమని కూతురు కోరేసరికి ఆ తండ్రి కాదనలేకపోయాడు.

father 2

ఏదో కొన్ని నెలలు సర్దుకుందాం అని.. తన భార్య కృష్ణ కుమారిని ఆస్ట్రేలియా కు పంపించాడు. అయితే.. ఎన్ని నెలలు గడిచినా.. తన కూతురు తల్లిని పంపించడానికి ఒప్పుకోవడం లేదు. ఇక ఉండబట్టలేక.. ఆ తండ్రి తన భార్యని పంపించాలి అంటూ గట్టిగానే అడిగాడు. అయితే.. ఆ కూతురు తండ్రి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. మరో వైపు అనారోగ్యం బారిన పడ్డ మృత్యుంజయ తన కొడుకు వద్ద ఉండడానికి చెన్నై వెళ్ళాడు. అక్కడ కోడలు కూడా మృత్యుంజయ ను సరిగ్గా పట్టించుకోకపోవడం తో తన భార్య ఉంటె బాగుండని అనుకున్నాడు.

father 1

మరోసారి కూతురుని అడిగినా.. ఆమె నుంచి అదే సమాధానం రావడంతో.. ఇక ఉండబట్టలేక కోర్ట్ లో కేసు వేసాడు. తన కూతురు.. తన భార్యను తీసుకెళ్లి తిరిగి పంపించడం లేదని.. ఆమెను తిరిగి పంపించేలా ఆదేశం ఇవ్వాలని కోరుతూ కోర్టులో కేసు వేసాడు. మృత్యుంజయ కొడుకు కూడా.. తన సోదరిపై కేసు వేసాడు. తన చెల్లి తల్లిని పంపడం లేదంటూ కేసు వేసాడు. ప్రస్తుతం.. కృష్ణ కుమారి అభిప్రాయం ఏమిటి అనేది కీలకం గా మారింది. ఈ స్టోరీ చూస్తే.. పిల్లలను చదివిస్తే.. వారికి రెక్కలొచ్చి విదేశాలకు వెళ్ళిపోయి.. తల్లితండ్రులను ఎన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారో అర్ధం అవుతూ ఉంది. అందరు ఇలానే ఉన్నారని కాదు.. కానీ చాలా మంది తల్లితండ్రులు ఇలాంటి ఇబ్బందులని ఎదుర్కుంటున్నారు.


End of Article

You may also like