వేరే భాషల హీరోయిస్స్ సక్సెస్ అయినట్లు తెలుగు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందడం లేదని చెప్పవచ్చు. అయితే విశాఖపట్టణానికి చెందిన మన తెలుగమ్మాయి రేఖా భోజ్ నటిగా మంచి గుర్తింపు పొందడానికి ఎంతో కష్టపడుతున్నారు.
Video Advertisement
రేఖా తండ్రి కె భోజరాజ్ ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నారు తల్లి గృహిణి. రేఖా విశాఖ నగరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమె తల్లి శోభన్ బాబుకి వీరాభిమాని. తల్లితో కలిసి సినిమాలు చూస్తూ ఉన్న రేఖాకి సినిమాలో నటించాలనే ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో రేఖా కల నెరవేరింది.
చదువుకునే కాలంలోనే రేఖ షార్ట్ ఫిలిమ్స్ అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్ కి వెళ్ళింది. అలాంటి సమయంలో రాకేష్ రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశాలు కల్పించాడు. రాకేష్ రెడ్డి దర్శకత్వంలో కాలాయ తస్మై నమః చిత్రంతో రేఖా సినీ ప్రస్థానం మొదలైంది.
రేఖా భోజ్ నటించిన చిత్రాలలో ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలయ్యాయి. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా రేఖ హీరోయిన్ గా లవ్ ఇన్ వైజాగ్ షార్ట్ ఫిలిం తీశారు. ఇదే కాంబినేషన్లో దర్టీ పిక్చర్ కూడా తెరకెక్కించారు. నటనలో మంచి ప్రతిభను కనభరించిన రేఖకు తన వరస ప్రాజెక్టులతో అవకాశం ఇచ్చాడు రాకేష్ రెడ్డి.
సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎటువంటి పాత్రకైనా తాను రెడీ ఉంటుంది రేఖా. ట్రాంజెండర్, బిచ్చగత్తె వంటి విభిన్నమైన పాత్రలు పై ఆసక్తి పెంచుకుంటుంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇష్టమైన హీరోలని, దర్శకుల్లో రాజమౌళి తనకు ఇష్టమైన దర్శకుడు అని చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేఖా భోజ్ పుష్ప కవర్ సాంగ్ ద్వారా యూట్యూబ్ లో మంచి పేరు సంపాదించుకుంది. అలాగే మంచి సినిమాలతో ముందుకు దూసుకు వెళ్లాలని అభిమానులు ఆశిస్తూన్నారు.