Ads
మనం నిద్రపోతున్న కూడా మన మెదడు పని చేస్తున్నప్పుడు వచ్చేవే కలలు. మనిషికి కలలు రావటమనేది ఎంతో సహజం. కలల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టే ఇంకొన్ని ప్రమాదకరమైనవి. కొన్ని కలలు ఎందుకు వచ్చాయో దానికి సమాధానం కూడా దొరకదు. అంటే పైన చెప్పిన రకాల్లో మనకొచ్చిన కల ఏ కోవకు చెందుతుందో తెలియని కలలు కూడా ఉంటాయి.
Video Advertisement
ప్రతీ కలకి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఇలాంటి కలలకి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. చాలా మందికి తరచుగా వచ్చే కల ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు పడిపోవడం. కనీసం పదిమందిలో ఏడుగురికి ఈ కల ఒక్కసారి అయినా వచ్చే ఉంటుంది.
ఈ కలకి అర్ధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంట్లో కానీ, లేక వృత్తిపరంగా, విద్యాపరంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి కల వస్తుంది. కొంతమంది ఈ కలని అదృష్టానికి సంకేతంగా భావిస్తే.. మరికొంతమంది దుఃఖానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. సాధారణం ఒకటి, రెండు సార్లు ఈ కల వస్తూనే ఉంటుంది. కానీ, తరచుగా ఈ కల వస్తోంది అంటే మాత్రం మీరు ఆలోచనలో పడాల్సి ఉంటుంది.
పదే పదే.. ఎత్తైన ప్రదేశం నుంచి మీరు కిందకి పడిపోతున్నట్లు కల కంటూ ఉంటె.. మీరు సాధించాలనుకున్న దానిలో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉందని అర్ధం. మీరు చేయబోయే పని మీద దృష్టి ఉంచి పని చేయాలి. గాలిలో మేడలు కట్టడం కాకుండా.. మీ కాళ్ళని నేల మీద నిలిపి చేసే పనిపై శ్రద్ధ ఉంచి పని చేయాలి. మీ కల మీకు చెప్పే సంకేతాలను అందుకుని పని పై మరింత శ్రద్ధ నిలిపి విజయం సాధించాలి. దీనిని మీరు స్వాధీనగలిగితే ఈ కలని స్వీయ అభివృద్ధికి సంకేతంగా భావించవచ్చని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
End of Article