మీకెప్పుడైనా కలలో ఈ జంతువులు కనిపించాయా..? అవి కనిపిస్తే ఏమి జరుగుతుందంటే..?

మీకెప్పుడైనా కలలో ఈ జంతువులు కనిపించాయా..? అవి కనిపిస్తే ఏమి జరుగుతుందంటే..?

by Anudeep

మనం గాఢ నిద్రలో ఉన్నపుడు కలలు రావడం సహజం. మనం ఉన్న పరిస్థితుల వల్లనో.. లేదా మనం పదే పదే దేని గురించి అయినా తలుచుకుంటూ ఉండడం వల్లనో కలలు వస్తుంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని సార్లు కలలు అస్సలు సంబంధం లేకుండా వస్తుంటాయి. మనకు మెలకువ వచ్చేసరికి అవి గుర్తుండవు. కొన్ని కొన్ని సార్లు మన కలల్లో రకరకాల జంతువులు కూడా వస్తూ ఉంటాయి. ఐతే.. ఈ జంతువులు మీ కలలలోకి ఎప్పుడైనా వచ్చాయా..? వస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోండి.

Video Advertisement

#1 ఆవు:

cow
మీ కలలోకి ఎప్పుడన్నా ఆవు వచ్చిందా..? ఆవు కలలోకి వచ్చిందంటే.. మీరు దైవ భక్తులని అర్ధం. దైవారాధన చేస్తుంటారని.. సాటి మనుషుల పట్ల సాత్వికం గా ప్రవర్తిస్తూ ఉంటారని అర్ధం. మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతున్న రోజులలో.. మీ కలలోకి ఆవు వస్తే.. మీ పని విజయవంతం గా పూర్తి అయిపోతుంది.

#2 ఏనుగు:

elephant 2
కలలో ఏనుగు కనిపించింది అంటే.. మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్ధం. లేదా.. మీకు ఇప్పటికే ఉన్న ఆర్ధిక ఇక్కట్లు తొలగిపోయి.. ఎదో ఒక విధం గా ధనం చేకూరుతుందని అర్ధం.

#3 గుడ్లగూబ:

owl
గుడ్లగూబ కు దేవతల వాహనం గా గుర్తింపు ఉంది. కొందరు గుడ్లగూబ ఎదురైతే.. అరిష్టం గా భావిస్తారు. కానీ, కలలో గుడ్లగూబ కనిపిస్తే.. వారికి ధనలక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుందని చెబుతుంటారు.

#4 సర్పము:

snakes
పాములు అంటే ఎవరికీ భయం ఉండదు చెప్పండి. కలలో కనిపించగానే మనం ఉలిక్కిపడతాం. ఎక్కువ గా సర్ప దోషం ఉన్నవారికి పాములు కలలోకి కూడా వస్తుంటాయని చెబుతారు. ఐతే.. పాము కనిపించిన విధాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాము మీ విజయానికి సహకరిస్తుంది. ఐతే.. పాము మీ పై బుసలు కొడుతున్నా, లేక మీ వెంట పడుతున్నట్లు కనిపించినా.. కష్టాలు రాబోతున్నాయని అర్ధమట.


You may also like