ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫామ్ ని చూసారా..? ఈ మార్పు వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా..?

ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫామ్ ని చూసారా..? ఈ మార్పు వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ మనందరికీ సుపరిచితమే. దాదాపు దశాబ్దాల తరబడి ఒకటే యూనిఫామ్ ఉంటూ వచ్చింది. ఈ యూనిఫామ్ ని తాజాగా మార్చేశారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి సరికొత్త ఆర్మీ యూనిఫామ్ ని అప్రూవ్ చేసారు. తాజాగా.. ఈ చేంజ్ చేసిన యూనిఫామ్ ను కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

Video Advertisement

పాత యూనిఫామ్ లో ఉన్న గుర్తింపుని, హుందాతనాన్ని పోగొట్టకుండా.. బోర్డర్ వద్ద ఉండి పోరాటం చేసే సైనికులకు ఏ కాలం లో అయినా కంఫర్ట్ గా ఉండే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది.

army 3

ఈ యూనిఫామ్ కు మార్పులు చేర్పులు చేయడం వెనక ఎంత కథ నడిచిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. దాదాపు దశాబ్దాల కాలంగా ఒకటే యూనిఫామ్ ని మన ఆర్మీ వారు ధరిస్తూ వచ్చారు. తాజాగా ఇతర దేశాల యూనిఫామ్ లను గమనించి, కొత్త టెక్నాలజీలను ఉపయోగించి మన సైనికులకు ఎల్ల వేళలా కంఫర్ట్ గా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో యూనిఫామ్ లో మార్పులు తీసుకురావాలని అనుకున్నారు.

army 2

ఆడ, మగ సైనికులకు ఇవి సౌకర్యవంతంగా మరియు క్యారీ చేయడానికి ఈజీ గా ఉండేవిధంగా వీటిని డిజైన్ చేసారు. దాదాపు రెండేళ్ల క్రితమే యూనిఫామ్ చేంజ్ చేయాలి అన్న ఆలోచన మొదలైంది. గత ఏడాది జరిగిన ఆర్మీ కమాండర్ కాన్ఫిరెన్స్ లో ఈ టాపిక్ గురించి చర్చ కూడా జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తో కలిసి ఈ యూనిఫామ్ ని డిజైన్ చేసారు. భారత ఆర్మీ యూనిఫామ్ కొంత అమెరికా ఆర్మీ ట్రూప్స్ యూనిఫామ్ ని పోలి ఉంటుంది.

army 1

విద్యార్థులు, ప్రొఫెసర్స్ మొత్తం ఎనిమిది మంది టీం కలిసి ఈ యూనిఫామ్ ని డిజైన్ చేయడానికి పని చేసారు. రెండేళ్ల క్రితమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ని ప్రభుత్వం కలిసింది. యూనిఫామ్ చేంజ్ గురించి కాంట్రాక్టు ను కుదుర్చుకుంది. ఎన్నో చర్చలు, ఫీడ్ బ్యాక్స్ తరువాత ఈ డిజైన్ ను కంఫర్మ్ చేసారు. ఇది కన్ఫర్మ్ చేయడానికి ముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ 4 రకాల క్లాత్స్ ను తీసుకుని 8 రకాల డిజైన్స్ ను రూపొందించింది. 15 రకాల పాటర్న్స్ కూడా ట్రై చేసారు. చివరకు ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ ను ఓకే చేసారు.


End of Article

You may also like