అమెరికా స్టాక్ మార్కెట్ లో ఇండియా నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలి..?

అమెరికా స్టాక్ మార్కెట్ లో ఇండియా నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలి..?

by Anudeep

Ads

సాధారణం గా మనం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టె సమయం లో వివిధ రంగాలు, పరిశ్రమలు మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్లలో పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తాము.చాలా కొద్ది మంది పెట్టుబడిదారులు పెట్టుబడి అవకాశాల కోసం భారతదేశ సరిహద్దులను దాటి ఆలోచిస్తారు. అంటే, కేవలం భారత్ లోనే కాకుండా అమెరికా వంటి ఇతర దేశాల్లో కూడా ఎలా పెట్టుబడులు పెట్టాలా..? అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇండియా నుండి యుఎస్ స్టాక్లలో ఎలా పెట్టుబడులు పెట్టాలో చూద్దాం..

Video Advertisement

us stock market

గత కొంత కాలం గా కరోనా కారణం గా స్టాక్ మార్కెట్ లు చాలా వరకు డౌన్ అయిపోయాయి. ఐతే తక్కువ సమయం లోనే.. చాలా వరకు వేగం పుంజుకున్నాయనే చెప్పొచ్చు. దీనితో చాలా మంది చాలా మంది భారతీయ పెట్టుబడిదారులు తమ స్టాక్ పోర్ట్‌ఫోలియోలను తిరిగి చెక్ చేసుకుంటున్నారు.

us stock market 2

యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఫేస్‌బుక్, గూగుల్, ఆపిల్, జనరల్ మోటార్స్ వంటి ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందిన కొన్ని ఉత్తమ స్టాక్‌లు ఉన్నాయి.. అటువంటి స్టాక్‌లను కొనడం వల్ల భారతీయ స్టాక్ మార్కెట్‌ కంటే డిఫరెంట్ గా ఉండటానికి మీకు అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మరింత గా సంపాదించుకోవచ్చు. భారతదేశం నుండి యుఎస్ స్టాక్స్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలో ఇప్పుడు చూద్దాం..

indian stock market

భారతదేశం నుండి యుఎస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి రెండు విభిన్న మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి స్టాక్స్‌లో ప్రత్యక్ష పెట్టుబడి పెట్టడం, రెండోది మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇటిఎఫ్‌ల ద్వారా స్టాక్స్‌లో పరోక్ష పెట్టుబడి పెట్టడం.

ప్రత్యక్ష పెట్టుబడి పెట్టడం:
ఇందులో మీరు దేశీయ లేదా విదేశీ బ్రోకర్‌తో ఫారీన్ అకౌంట్ ను తెరవడం ద్వారా డైరెక్ట్ గా అమెరికా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టేయవచ్చు. అమెరికా లో స్టాక్ ను కొనడానికి కూడా చాలా మంది దేశీయ బ్రోకర్లు ఉన్నారు. వీరు మీకు, అమెరికా స్టాక్ లకు మధ్యవర్తిత్వం గా వ్యవహరిస్తూ లావాదేవీలను జరపుకోవడాని సాయపడతారు. అలానే, విదేశాల్లో ఉండే బ్రోకర్ల ద్వారా కూడా మీరు ఈ సేవలను పొందవచ్చు. అయితే, నమ్మకస్తులైన బ్రోకర్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

india stock market

పరోక్ష పెట్టుబడి పెట్టడం:
పరోక్షం గా అంటే.. బ్రోకర్లు లేకుండా మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్), కొత్త అప్లికేషన్లకు పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం తేలికైన పధ్ధతి. దీనిద్వారా కనీస డిపాజిట్‌ను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమంది స్టాక్ బ్రోకర్లు ప్రత్యక్ష అంతర్జాతీయ పెట్టుబడులను అందిస్తున్నారు.యుఎస్ స్టాక్స్ మరియు / లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అనేక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. పెట్టుబడి పెట్టడానికి సరైన స్టాక్‌లను ఎంచుకోవడం లో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేయడం మంచి ఛాయిస్. అయితే, కొనుగోలు చేయడానికి ముందు మ్యూచువల్ ఫండ్ పథకం గురించి పూర్తి గా తెలుసుకోండి.

 

 


End of Article

You may also like