నిన్న జరిగిన డబుల్ సూపర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ మీమ్స్…..క్రికెట్ చరిత్రలో మొదటిసారి….

నిన్న జరిగిన డబుల్ సూపర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ మీమ్స్…..క్రికెట్ చరిత్రలో మొదటిసారి….

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టు కి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. అయితే నిన్నటి మ్యాచ్ లో ఒకసారి కాదు, రెండుసార్లు సూపర్ ఓవర్స్ నిర్వహించారు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో రెండుసార్లు సూపర్ ఓవర్స్ జరిగిన మొట్ట మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం.

Video Advertisement

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. డికాక్ (53: 43 బంతుల్లో 3×4, 3×6), కీరన్ పొలార్డ్ (34 నాటౌట్: 12 బంతుల్లో 1×4, 4×6), కౌల్టర్ నైల్ (24 నాటౌట్: 12 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోర్ చేసింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (77: 51 బంతుల్లో 7×4, 3×6) చేయగా, క్రిస్‌గేల్ (24), నికోలస్ పూరన్ (24), దీపక్ హుడా (23) చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోర్ చేయడంతో సూపర్ ఓవర్ జరిగింది.

మొదటి సూపర్ ఓవర్ లో కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ బ్యాటింగ్ కి రాగా, జస్‌ప్రీత్ బూమ్రా బౌలింగ్ చేశారు. మొదటి బాల్ కి రాహుల్ సింగిల్ ఇవ్వగా, రెండవ బాల్ నికోలస్ పూరన్ అవుట్ అయ్యారు. తర్వాత క్రీజ్ లోకి దీపక్ హుడా వచ్చారు. మూడవ బాల్ కి రాహుల్ మళ్లీ సింగిల్ తీయగా, నాలుగవ బాల్ కి దీపక్ హుడా సింగిల్ తీశారు. ఐదవ బాల్ కి డబుల్ తీయగా, ఆఖరి బంతికి అవుటయ్యారు రాహుల్. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 2 వికెట్ల నష్టంతో 5 పరుగుల స్కోర్ చేసింది.

దాంతో ముంబై ఇండియన్స్ జట్టు లక్ష్యం 6 పరుగులుగా నిలిచింది. రోహిత్ శర్మ, డికాక్ బ్యాటింగ్‌ కి రాగా, మహమ్మద్ షమీ బౌలింగ్ చేశారు. మహమ్మద్ షమీ చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ జట్టు కూడా 5 పరుగుల స్కోర్ చేసింది. చివరి బాల్ కి పరుగు తీయాలని ప్రయత్నించిన డికాక్ రనౌట్ అయ్యారు. దాంతో మళ్ళీ రెండు జట్ల స్కోర్స్ సేమ్ అవ్వడంతో, మళ్లీ రెండవసారి సూపర్ ఓవర్ నిర్వహించారు.

రెండవ సూపర్ ఓవర్ లో ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ క్రీజ్ లోకి రాగా, క్రిస్‌ జోర్దాన్ బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 11 పరుగుల స్కోర్ చేసింది. దాంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు టార్గెట్ 12 పరుగులుగా నిలిచింది.

క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ‌కి రాగా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేశారు. మొదటి బాల్ కి సిక్స్ కొట్టిన గేల్, రెండవ బాల్ కి సింగిల్ తీశారు. తర్వాత మూడవ బాల్, నాలుగవ బాల్ ని బౌండరీకి తరలించారు మయాంక్. ఇంకో రెండు బాల్స్ ఉండగానే టార్గెట్ ఫినిష్ చేయడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా రెండు సూపర్ ఓవర్స్ తో కొత్త రికార్డ్ సృష్టించిన ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

#19#20#21#22#23#24#25#26

 


End of Article

You may also like