ఉపవాసం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?

ఉపవాసం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?

by kavitha

Ads

ఉపవాసం అంటే ఆహారం తీసుకోకపోవడం. అయితే చాలా మంది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఉపవాసం చేస్తుంటారు.  పండుగల, పర్వదిన సమయంలో ఉపవాసం చేస్తుంటారు. ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపవాసం చేస్తున్నారు.

Video Advertisement

అసలు ఉపవాసం చేసినపుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఫాస్టింగ్ లో ఎన్ని రకాలున్నాయి. ఫాస్టింగ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది. ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు. ఫాస్టింగ్ వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఉపవాసం చేయడం వల్ల శరీరాన్ని సమతుల్యం చేయడానికి దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. మనం ఆహారం తీసుకున్న ప్రతీ సారీ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ తీసుకున్న ఆహారంలో నుండి రిలీజ్ అయిన చక్కెరలను 2 రకాలుగా శరీరంలో నిల్వ చేయడానికి సహకరిస్తుంది. శరీర అవసరాలకు సరిపోయిన తరువాత మిగిలిన చక్కెరలను ‘గ్లైకోజెన్’ గా కాలేయంలో, శరీర కండరాల్లో నిల్వ చేస్తుంది. అయితే దీనికి ఒక లిమిట్ అనేది ఉంది. దానికి మించి గ్లైకోజెన్ గా మార్చలేదు.పరిమితిని దాటిన గ్లూకోజ్ ను గ్లైకోజెన్ లా కాకుండా కొవ్వు రూపంలో లివర్ లో నిల్వ చేస్తుంది. అంతే ఇక కొవ్వు పెరుగుతున్న కొద్దీ వివిధ శరీర భాగాలలో నిల్వ చేయబడుతుంది. ఫాస్టింగ్ చేసినపుడు ఆహారం తీసుకోము కాబట్టి శరీరంలో నిల్వ చేయబడిన కొవ్వుని వాడుకుని శక్తి విడుదల అవుతుంది.
ఉపవాసంలో మూడు రకాలు ఉన్నాయి..

1. 5:2 ఆహారం అంటే ఈ ఉపవాసం చేసేవారు వారానికి 5 రోజులు ఆహారం తీసుకుంటారు. మిగతా 2 రోజులు ఫాస్టింగ్ చేస్తారు.

2. 16:8 ఫాస్టింగ్ ఈ పద్ధతిలో ఒకేరోజులో 8 గంటలలోపు ఆహారం తీసుకుని, మిగతా  16 గంటల పాటు ఉపవాసం ఉండాలి. దీనిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు.

3. 18:6 ఫాస్టింగ్ ఈ పద్ధతిలో 6 గంటలలోపు ఆహారం తీసుకుని, 18 గంటలు ఫాస్టింగ్ చేస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు: 

  • ఉపవాసం చేస్తే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావని, లైఫ్‌స్పాన్‌ పెరుగుతుందని ఓ పరిశోదనంలో వెల్లడించింది.
  • బరువు తగ్గించే ప్రక్రియను పెంచుతుందని  పరిశోధనలు చెబుతున్నాయి. ఉపవాసం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందని బరువు తగ్గుతారు.
  • మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఉపవాసం చేస్తే హైపర్‌టెన్షన్‌ నియంత్రణలో ఉంటుంది.  ట్రైగ్లిజరైడస్‌ స్థాయులు తగ్గి,  గుండెకు మేలు చేస్తాయి.
  • ఉపవాసం వల్ల  శరీరంలోని ఇన్సులిన్ ను గ్రహించే స్వభావం మెరుగవుతుందని, రక్తంలో గ్లూకోజ్ నిల్వల పై నియంత్రణ పెరిగి, టైప్ టూ డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
  • ఉపవాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది.
  • ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దానివల్ల క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది.
  • ఉపవాసం ఉన్నవారిలో రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే ఫాస్టింగ్ పారాసింపథెటిక్ కార్యకలాపాలను పెంచుతుందని పతద్వారా రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది.
  • ఫాస్టింగ్ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • శరీరంలోని విషపదార్థాలు తొలగించబడుతాయి.
    ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు..
  • ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు.
  • గర్భవతి లేదా పాలిచ్చే తల్లులు.
  • 65 ఏళ్ల వయసు పైబడిన వారు.
  • చిన్నపిల్లలు
  • తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు.
  • మందులు వాడేవారు.Also Read: జీడిపప్పు ఎవరు తినచ్చు? ఎవరు తినకూడదు? షుగర్, హార్ట్ ప్రాబ్లెమ్ ఉంటే తినకూడదా..?

 


End of Article

You may also like