“నా సామి రంగా” మూవీలో ఆ సీన్‌ మార్చారా..? లేకుంటే ఇక్కడ ఫాన్స్ ఒప్పుకోరా.?

“నా సామి రంగా” మూవీలో ఆ సీన్‌ మార్చారా..? లేకుంటే ఇక్కడ ఫాన్స్ ఒప్పుకోరా.?

by kavitha

Ads

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగా’ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు.

Video Advertisement

ఈ మూవీ ‘పొరింజు మరియం జోస్‌’ అనే మలయాళ సూపర్ హిట్ మూవీకి  రీమేక్‌ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ ప్రారంభం కాక ముందు ఈ మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. తాజాగా ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నా సామి రంగా’ జనవరి 14కి రిలీజ్ కానుంది. ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎక్కువగానే ఉంది. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, సినిమాలతో పాటు  డబ్బింగ్ మూవీ అయలాన్ కూడా రిలీజ్ కానుంది. ఈ ఐదు సినిమాలు ఒకటి, రెండు రోజుల తేడాతో రిలీజ్ కానున్నాయి. ‘నా సామి రంగా’ రీమేక్ మూవీ అనే విషయం తెలిసిందే.
మూడేళ్ళ క్రితం మలయాళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్‌ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ యాంటీ క్లైమాక్స్ మూవీ. నాగార్జున ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకుని రిస్క్ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రీమేక్ అని తెలిసిన వెంటనే చాలామంది మలయాళ మూవీని చూశారు. ఇక మలయాళ మూవీ స్టోరీ, కథనం తెలుగుకి వర్కౌట్‌ కాదు. ఎందుకంటే మలయాళ మూవీలో హీరో పాత్ర చనిపోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఆ సీన్ ను ఏమైనా మార్చరా లేదంటే, తెలుగు ప్రేక్షకులు అలాంటి ముగింపును అంతగా ఇష్టపడరు. అలా వచ్చిన సినిమాలు ఎన్నో ప్లాప్ అయ్యాయి. గతంలో నాగార్జున నటించిన ‘స్నేహమంటే ఇదేరా’ మూవీ కూడా సాడ్‌ ఎండింగ్‌ ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ అలా కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో నాగార్జున ఇంత రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు.

Also Read: గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి కారణం అతనా…!


End of Article

You may also like