దగ్గుబాటి వెంకటేష్, రానా ఇద్దరూ ప్రయోగాలకు వెనుకాడరు. మల్టీ స్టారర్స్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ బాబాయ్, అబ్బాయి కలిసి ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి ‘రానా నాయుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. బాబాయ్‌ వెంకీతో కలిసి రానా తొలిసారి ఇందులో నటిస్తున్నాడు. అది కూడా ఆయన కొడుకు పాత్రలో కావడంతో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది.

Video Advertisement

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోయే ఈ సిరీస్ లో వెబ్ సిరీస్ కోసం తెలుగు అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ నెట్ ఫ్లిక్స్ నిన్న ‘రానా నాయుడు’ టీజర్ విడుదల చేసింది. తండ్రి, కొడుకుల మధ్య వైరం ఇతివృత్తంలో ఈ వెబ్ సిరీస్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

is venkatesh making a mistake
అయితే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు విక్టరీ వెంకటేష్ ని ఎక్కవ ఫ్యామిలీ సినిమాల వైపు ప్రేరేపించాయి. వెంకీ లో మాస్ ఎనర్జీ ఉన్నప్పటికీ ఎందుకో ఆ జానర్ ని ఎక్కువ టచ్ చేయలేకపోయారు. జెమిని సినిమా ప్రతికూల ఫలితం, ఘర్షణ, గణేష్ లాంటివి హిట్ అనిపించుకున్నా కమర్షియల్ గా పెద్ద స్కేల్ కు వెళ్ళకపోవడం లాంటి కారణాల వల్ల వెంకటేష్ పూర్తిగా ఫామిలీ సినిమాల వైపుకి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యం లో రానా నాయుడు టీజర్ విడుదలవ్వడంతో వెంకీ ఫాన్స్ ఈ విషయమై అసంతృప్తిగా ఉన్నారంట.

is venkatesh making a mistake

భారీ బడ్జెట్ తో బాబాయ్ అబ్బాయి వెంకటేష్ రానాల కాంబినేషన్ లో నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ కాంబో ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నదే. కేవలం నిమిషంలోపే కట్ చేసినప్పటికీ ఈ చిన్న వీడియోలోనే బోలెడంత ఫ్యాన్ స్టఫ్ ఇచ్చేశారు.

is venkatesh making a mistake
ముఖ్యంగా జైల్లో బారుడు తెల్ల గెడ్డంతో వెంకీని చూపించడం, బయటికి వచ్చాక తమిళ హీరో అజిత్ స్టైల్ లో దాన్ని ట్రిమ్ చేయించి అల్ట్రా స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడం అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇదేదో బిగ్ స్క్రీన్ కోసం చేసుండొచ్చు కదా అనేది అభిమానుల ఆవేదన. ఇది థియేటర్ కోసం నిర్మించింది కానప్పటికీ ఇలాంటి గెటప్, ఊర మాస్ లుక్ ని వెండితెర మీద ఎంజాయ్ చేసేందుకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు.

is venkatesh making a mistake
నారప్ప విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇది తెలిసే ఎఫ్3 క్లైమాక్స్ లో అలా కాసేపు కనిపించి ఊరట కలిగించారు. ఇప్పుడు రానా నాయుడు వంతు వచ్చింది. ఏది ఏమైనా రాబోయే సినిమాల్లో అయినా విక్టరీ వెంకటేష్ కంప్లీట్ కమర్షియల్ మూవీ ఒకటి సోలో హీరోగా చేస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు.

is venkatesh making a mistake
రానా నాయుడు విషయానికి వస్తే.. వెంకీ, రానా ఇద్దరూ ఘర్షణ పడే సీన్ వెబ్ సిరీస్ పై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. తండ్రి కొడుకుల మధ్య వైరమే ఈ సిరీస్ కు హైలైట్ గా నిలవనుంది. ఈ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ తేదీని నెట్ ఫ్లిక్స్ ఇంకా వెల్లడించలేదు.