మనం ఏదైనా చెడు గా మాట్లాడుతున్న సమయం లో.. వెంటనే మన పెద్దవాళ్ళు వచ్చి మనలని అలాంటి మాటలు మాట్లాడద్దని.. తధాస్తు దేవతలు ఉంటారని చెబుతుంటారు. తధాస్తు దేవతలు ఎవరైనా స్వగతం లో అనుకునే మాటలను “తధాస్తు” అని అనేస్తే అవి కచ్చితం గా జరిగిపోతుంటాయి అంటుంటారు. ఇంతకీ వీరు ఎవరు.. పురాణాల్లో వీరి గురించి ఏమని చెప్పబడి ఉందొ తెలుసుకుందాం.

aswini devatalu 2

వేదాలలో “అనుమతి” అనే దేవతలు ఉంటారట. యజ్ఞ యాగాదుల సమయం లో ఈ దేవతను స్మరించి.. కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయట. శుభకార్యాలు ఎక్కడ జరిగితే అక్కడ ఈ అనుమతి దేవతలు ఉండడానికి ఇష్టపడతారట. వీరినే తధాస్తు దేవతలు అని పిలుస్తారు. శుభకార్యాలు జరిగే ప్రదేశాల్లో వీరు ఎక్కువ గా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా స్వగతం గా ఏమైనా అనుకుంటూ ఉంటె.. వారిని తధాస్తు అని దీవిస్తూ ఉంటారు.

aswini devatalu 3

ఐతే.. ఇది కేవలం సొంత విషయం లో మాత్రమే జరుగుతుంది. పరుల విషయం లో మనం ఏమి అనుకున్నా అవి జరగవు. అందుకే.. పెద్దలు కూడా ఎల్లప్పుడూ చెడు మాట్లాడకూడదు అంటూ చెబుతుంటారు. సూర్యుని కవల పిల్లలే తధాస్తు దేవతలు. వీరినే అశ్విని దేవతలు అని కూడా చెబుతుంటారు. సంధ్యా సమయాలలో మనం అనుకునే విషయాలను వీరు తధాస్తు అని దీవిస్తూ ఉంటారు అని చెబుతుంటారు.

aswini devatalu

ఋగ్వేదము 1 వ మండలంలోని 16వ అనువాకము లో 112 నుంచి 117 వరకు ఉన్న సూక్తాలలో వీరి ప్రస్తావన ఉంటుందట. ఈ అశ్విని దేవతలే మహా భారతం లో నకుల సహదేవులుగా జన్మించారని చెబుతారు. అలాగే దక్ష ప్రజాపతి వద్ద వీరు ఆయుర్వేదం విద్యను అభ్యసించి ఇంద్రునికి నేర్పించారట. వీరికి ఉష అనే ఓ సోదరి కూడా ఉందట. ఆమె వీరిని ఉదయం బ్రహ్మి ముహూర్త సమయం లోనే మేల్కొల్పుతుందట. ఆ తరువాత వీరు తమ సోదరితో పాటు తూర్పు నుంచి పడమర దిశగా వాయువేగం తో పయనిస్తుంటారట.

aswini devatalu

తధాస్తు దేవతలు అత్యంత దయ కలిగిన వారు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీరు వైద్య శాస్త్రానికి అధిపతులు. విరాట్ పురుషుని నాసికా భాగం లోనే ఈ దేవతలు ఉంటారు. సూర్యుడు, ఛాయాదేవి అశ్వరూపం లో ఉండగా సంబోధించడం వలన వీరు జన్మించారని చెబుతుంటారు.