సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా అంతే భారీ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంది. తమిళ్ తో పాటు, తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది.

Video Advertisement

రజినీకాంత్ ని చూసిన వాళ్లు అందరూ కూడా అసలు ఇన్ని సంవత్సరాలు దీని కోసమే కదా ఎదురు చూసింది అంటూ ఆనందించారు. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు ఇంకా ఎంతో మంది పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు.

comments on this scenes in jailer

సినిమాలో ఫైట్ సీన్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో ఎంజాయ్ చేయాల్సిన సినిమా కాబట్టి చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలోనే చూశారు. రిపీటెడ్ గా సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 7 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో జైలర్ సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రకటించారు.

jailer movie review

తమిళ్ తో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సినిమాకి దాదాపు 600 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో వచ్చిన హైయెస్ట్ కలెక్షన్లు వచ్చిన పెద్ద సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన నెక్స్ట్ సినిమా మీద కూడా ఆసక్తి నెలకొంది. నెక్స్ట్ సినిమా జై భీమ్ దర్శకుడు అయిన జ్ఞానవేల్ తో చేస్తారు అని అంటున్నారు. ఈ సినిమా కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగానే ఉంటుంది అని సమాచారం.

jailer movie story point

ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా హీరో శర్వానంద్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇంతే కాకుండా రజినీకాంత్ మరి కొన్ని సినిమాల్లో కూడా నటించబోతున్నారు. కానీ వాటికి సంబంధించిన వివరాలు ఏవి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఆ సినిమాల గురించి తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

ALSO READ : జైలర్ మూవీకి రజిని రమ్యునరేషన్ తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే..!