జవహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర సమరయోధుడు మరియు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతను 14 నవంబర్ 1889న అలహాబాద్‌లో జన్మించాడు. జవహర్ లాల్ నెహ్రూ జన్మస్థలం అహ్మదాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్. పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో 1889 నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య అంతా అక్కడే ఇంటి దగ్గరే ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే సాగింది. కాశ్మీరీ పండిట్ సంఘంతో అతని అనుబంధం కారణంగా, అతను పండిట్ నెహ్రూ అని కూడా పిలువబడ్డాడు. అతని తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ తల్లి పేరు స్వరూప రాణి.
Video Advertisement
నెహ్రూ 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు, మొదట తాత్కాలిక ప్రధానమంత్రిగా, ఆపై 1950 నుండి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1910లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఉన్నత విద్య కోసం, యువ నెహ్రూను హారో పాఠశాలకు పంపారు, తరువాత సహజ శాస్త్రాలలో డిగ్రీని పొందేందుకు ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పంపబడ్డారు. లండన్‌లోని ఇన్నర్ టెంపుల్‌లో రెండు సంవత్సరాలు గడిపిన తర్వాత, అతను బారిస్టర్‌గా అర్హత సాధించాడు.
నెహ్రూ 8 ఫిబ్రవరి, 1916న 26 ఏళ్ళ వయసులో కమలా కౌల్‌ను వివాహం చేసుకున్నారు. 1921 నాటి సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో, అలహాబాద్‌లో విదేశీ వస్త్రాలు మరియు మద్యం విక్రయించే దుకాణాలను పికెటింగ్ చేయడం మరియు మహిళల సమూహాలను నిర్వహించడం ద్వారా కమల కీలక పాత్ర పోషించింది. నవంబర్ 19, 1917 న ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె ఇందిరా ప్రియదర్శిని. జవహర్‌లాల్ నెహ్రూ జైలులో ఉండగా కమల క్షయవ్యాధితో స్విట్జర్లాండ్‌లో ఫిబ్రవరి 28, 1936న మరణించింది.
అయితే తాజాగా నెహ్రూ – కమల దంపతుల పెళ్లి పత్రిక వైరల్ గా మారింది. ఉర్దూ లో ముద్రించిన ఈ పత్రిక లో పెళ్లి కూతురి పేరు ముద్రించలేదు. అవి మొత్తం మూడు పత్రికలున్నాయి. అందులో ఒకదాంట్లో మోతీ లాల్ నెహ్రూ గారు అందర్నీ ఆహ్వానిస్తున్నారు. అందులో ” నా కొడుకు జవహర్‌లాల్ నెహ్రూ పెళ్లి రోజున ఫిబ్రవరి 7, 1916 సాయంత్రం 4 గంటలకు జరపాలని నిర్ణయించాము. అందరు ఆ రోజు టీ పార్టీ కి రావాలని కోరుతున్నాము.” అని ఉంది. అలాగే రెండో లేఖలో “మీరు, మీ కుటుంబ సభ్యులు నా కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూకు, ఢిల్లీ నివాసి జవహర్మల్ ముల్ కౌల్ కుమార్తెకు ఫిబ్రవరి 7 ,8 , 9 తేదీల్లో జరగాల్సిన వివాహ వేడుకలో పాల్గొంటారని ఆశిస్తున్నాను.” అని ఉంది.
అలాగే తర్వాత మూడో పత్రికలో..”జవహర్మల్ ముల్ కౌల్ కుమార్తెతో నా కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ వివాహం జరిగిన తర్వాత.. ఫిబ్రవరి 9, 1916న రాత్రి 8 గంటలకు వధువు రాగానే.. మీరు మరియు మీ కుటుంబ సభ్యులతో కలిసి మా వినయపూర్వకమైన ఇంట్లో జరిగే విందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాము.” అని మోతీలాల్ నెహ్రూ ఆ మూడు పత్రికల్లో పేర్కొన్నారు.
ఉర్దూ లో రాసి ఉన్న ఈ లేఖలను బట్టి చూస్తుంటే.. ఉర్దూతో నెహ్రూ కుటుంబానికి ఉన్న బంధం తెలుస్తోంది. నెహ్రూ కు ఉర్దూతో పాటు, నెహ్రూ ఇంగ్లీష్, హిందీ మరియు సంస్కృతం వంటి భాషల్లో ప్రావీణ్యం ఉంది. కాంగ్రెస్ పై ముస్లిం వర్గానికి కాస్త వ్యతిరేకత ఉన్నా కూడా.. నెహ్రూను చాలా మంది ఉర్దూ కవులు రాజనీతిజ్ఞుడిగా కీర్తించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నెహ్రూ ఉర్దూ ముషైరా (సింపోజియం)కి హాజరయ్యేవారు.