చర్చనీయాంశంగా మారిన చిరుకి జెడి రాసిన లేఖ! మెగా స్టార్ గా పిలువలేము…ఎందుకంటే?

చర్చనీయాంశంగా మారిన చిరుకి జెడి రాసిన లేఖ! మెగా స్టార్ గా పిలువలేము…ఎందుకంటే?

by Anudeep

Ads

శివ’ సినిమాలో విలన్ గ్యాంగ్ లో చిన్న రౌడీ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, డైరక్టర్ గా సెటిలైన నటుడు జేడీ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవి కి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో మిమ్మల్ని మెగాస్టార్ అనలేం సార్.. అంతకుమించి అని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్ధకంగా మారిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి తెలుగు సినీ పరిశ్రమలోని పేదలందరికీ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ విష‌యంపై మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ జేడీ చ‌క్ర‌వ‌ర్తి లేఖ రాశారు.
ప్రియమైన చిరంజీవిగారు..నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మిమ్మల్ని ఒక నటుడిగా ఇష్ట‌ప‌డేవాడిని.. అంత‌కు మించి కాదు. నా తోటి నటులంద‌రూ సాయంత్ర వేళల్లో .. మీతో కలిసి స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపేవారు… నేనెప్పుడూ అలా చేయ‌లేదు, చేయాల‌నుకోలేదు. ఇది నేను మీకు రాస్తున్న ఓపెన్ లెటర్. సినిమా ప‌రిశ్ర‌మ కూడా ఎప్పుడూ లేనంతగా నష్టపోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు.

Video Advertisement

నాతో పాటు మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కానీ మీరు ఈ ఆపత్కాలంలో.. చేతలతో ముందుకు వచ్చారు. ఇది ఇన్ క్రెడిబుల్. మిమ్మల్ని అభిమానులే కాదు.. అందరూ ఎందుకు అంతగా ఇష్టపడతారో, నమ్ముతారో మీరు ఇప్పుడు చేస్తున్న పనే నిదర్శనం.మీరు మెగాస్టార్ కాదు మీరు మెగాస్టార్ కంటే కూడా.. ఓ గొప్ప వ్య‌క్తిగా అభివ‌ర్ణించాలి. సినీ కార్మికులు నాకు ఫోన్ చేసిన‌ప్పుడు తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశార‌ని తెలిపారు.

ALSO READ : ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక…పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.

మీరు ఇండ‌స్ట్రీ రుణం తీర్చుకుంటున్నాన‌ని అంటున్నారు కానీ కార్మికుల ప‌ట్ల అది మీకున్న గౌర‌వంగా భావిస్తున్నాను. మీ హృదయం కరెక్ట్ ప్లేస్ లో ఉంది. చాలా మందికి హృదయం ఉంటుంది. కానీ అది రైట్ ప్లేస్ లో ఉండదని అందులో నేను కూడా ఒకడిని . ఇప్పుడు మెగాస్టార్ ని మరింత అభిమానిస్తున్నాను. హోలీ హ్యుమన్ మై చిరు…ఎప్ప‌టికీ మీ అభిమానిని, అనుచరుడిని. నటుడిగా కాకుండా మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నాను. ప్రేమిస్తున్నాను. లాక్ డౌన్ లేకపోతే .. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. బిట్టర్ హ్యుమన్ బీయింగ్ నుంచి… బెటర్ హ్యుమన్ గా ఎలా మారాలో మీ దగ్గర నేర్చుకోవాలి..’’ అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు జేడీ చ‌క్ర‌వ‌ర్తి.

ALSO READ : ట్రెండింగ్: మీరంటే ఉన్నోళ్లు బ్రో…ఈ టాప్ 20 మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు!


End of Article

You may also like