వినేవాడు ఉంటె చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు అని అనడానికి ఇదే ఉదాహరణ. చిన్న చిన్న ట్రిక్స్ తో మేజిక్ చేసి మోసం చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. ఇది కూడా అలాంటిదే. ఒక అరటిపండుని చూపించి దానిని కనీసం కత్తి లేకుండా, ముట్టుకోకుండా కోసి చూపించేస్తారు. ఆ పండు తింటే సంతానం కలుగుతుంది అని చెప్పి నమ్మిస్తుంటారు. అయితే దీని వెనకాల అసలు ఏమి జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

banana trick

భారతదేశం సనాతన దేశం. అన్ని ధర్మాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. కాలక్రమం లో మార్పులు చోటు చేసుకుని, ధర్మానికి గల అర్ధాలు మారిపోతున్నాయి. భగవంతుని పూజించే విధానం, నమ్మే విధానం లో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భగవంతుడి పై భక్తి కంటే.. మూఢనమ్మకాలు, భయం వంటివి ఉండడం కొంత చింతించాల్సిన విషయమే. ఇలాంటివి ఉండడం వలనే మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల జరుగుతున్న మోసాలలో ఈ బనానా ట్రిక్ కూడా ఒకటి.

banana trick 2

ఓ అరటిపండుని తీసుకుని సన్నని సూది తో కనిపించకుండా హోల్ చేసి లోపల కట్ చేసి తెచ్చుకుంటారు. దానిని చూపించి చేతులను అటూ ఇటు కదుపుతూ ఆ బనానాని ముట్టుకోకుండానే కట్ చేసినట్లు చూపిస్తారు. ఈ పండు తింటే సంతానం కలుగుతుందంటూ జనాలను నమ్మిస్తుంటారు. ఈ మోసం ఎలా జరుగుతుందో మీరు ఈ కింద వీడియో లో చూడొచ్చు.

Watch Video: