Ads
మన తాత ముత్తాతలను మనం ఇప్పటికీ గుర్తుంచుకోగలుగుతున్నాం అంటే.. దానికి కారణం మన ఇంట్లో వేలాడే వారి ఫొటోస్. మన పూర్వీకుల ఫోటోలను మన ఇంట్లో గోడలకు వేలాడతీసుకుంటూ ఉంటాం. వారిని నిత్యం స్మరించుకుంటూ ఉంటాం. వారి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తాం. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది ఈ ఫోటోలను వేలాడతీయడం లో కొన్ని తప్పులు చేస్తుంటారట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement

మనమంతా ఇంట్లో గోడకి మన పూర్వీకుల ఫోటోలను వేలాడతీస్తాం. కానీ.. వాస్తవానికి, మరణించిన వారి ఫోటోలను ఇలా గోడలకు వేలాడతీయకూడదట. ఏదైనా చెక్క బల్ల పై పెట్టుకోవాలట. కొందరు అయితే.. ఈ ఫోటోలను దేవత మందిరాలలో ఉంచుకుంటారు. ఇలా కూడా చేయకూడదట. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో కలహాలు ఎక్కువ అవుతాయట.

కొందరి ఇంట్లో ఐతే.. మరణించిన వారి ఫోటోల పక్కనే.. జీవించి ఉన్న వారి ఫోటోలను కూడా కలిపి పెడుతుంటారు. ఇలా చేయడం వలన జీవించి ఉన్న వారి ఆయుష్షు తగ్గుతుంది. ఇంట్లోకి రాగానే ఎదురుగా.. మరణించిన వారి ఫోటోలు కనిపించేలా పెట్టకూడదట. ఇలా పెడితే.. ఆ ఇంట్లో ఎక్కువ గా నెగటివ్ వాతావరణం ఉంటుందట. అయితే.. మరణించిన వారి ఫోటోలను హాల్ లో ఉత్తర దిక్కున ఉంచడం మంచిదట.
End of Article
