Ads
ఒకప్పటి రోజుల్లో రాజులకు బహు భార్యత్వం అనుమతి ఉండేది. అంటే.. ఒకరు కాకుండా ఇంకా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి రాజులకు అనుమతి ఉండేది. రాజులు కూడా ఇద్దరు ముగ్గురిని వివాహం చేసుకుంటూ ఉండేవారు. కొందరైతే పది పదిహేనుమందిని కూడా పెళ్లి చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ, ఇజ్రాయిల్ కు చెందిన ఓ రాజు మాత్రం ఏకం గా ఏడువందల మందిని పెళ్లి చేసుకున్నాడు.అతని కథ ఏంటో చూద్దాం..
Video Advertisement
ఇజ్రాయిల్ కు చెందిన సులేమాన్ అనే రాజు ఏకం గా 700 ల పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనకు పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన నిత్య పెళ్లికొడుకులా ఉండేవాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉండేవాడు. ఏ దేశ పర్యటన కు వెళ్లినా.. అక్కడి దేశం తో సత్సంబంధం కోసమే.. ఆయన అక్కడి వారిని పెళ్లి చేసుకునే వారని తెలుస్తోంది. ఆయన కు 700 ల మంది భార్యలతో పాటు 300 మంది పరిచారికలు కూడా ఉన్నారట.
700 ల మంది భార్యలు ఉన్నా కూడా.. మరో 300 ల మంది అందమైన యువతుల్ని తనకు సపర్యలు చేయించుకునేందుకు నియమించుకున్నాడట. ఆయన భార్యలలో చాలా మంది విదేశీ యువరాణులు కూడా ఉన్నారు. ఆరోజుల్లోనే.. ఆయన పెళ్లి గురించి ప్రపంచమంతా చర్చించేవారు. అంతర్జాతీయం గా సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఆయన ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని చెప్పుకునేవారు.
అందుకే, ఆయన పలువురు విదేశీ యువరాణులను పెళ్లి చేసుకున్నారు. కేవలం పెళ్లిళ్లు చేసుకునే కాదు.. ఆయన ప్రసిద్ధ జెరూసలేం ఆలయాన్ని..పలు చారిత్రాత్మక కోటలను కూడా నిర్మించారట. అనేక రాజ భవనాలను కూడా సులేమాన్ నిర్మించారట. అయితే.. ఆయన చేసుకున్న పెళ్లిళ్ల సంఖ్యను మాత్రం ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదు
End of Article