ప్రపంచం లోని ‘అతి పెద్ద రైల్వే స్టేషన్’ ఎక్కడ ఉందో తెలుసా..?? దాని ప్రత్యేకతలు ఏంటంటే..??

ప్రపంచం లోని ‘అతి పెద్ద రైల్వే స్టేషన్’ ఎక్కడ ఉందో తెలుసా..?? దాని ప్రత్యేకతలు ఏంటంటే..??

by Anudeep

Ads

ప్రపంచం లోని అన్ని దేశాలకు రైలు మార్గం ప్రధాన రవాణా సాధనం కావడం తో అన్ని దేశాల్లోని ఈ రవాణా వ్యవస్థ విస్తరించి ఉంది. అయితే ప్రపంచం లోని అన్ని దేశాలతో పోలిస్తే అతి పెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా..?? ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ టైటిల్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పేరుతో రిజిస్టర్ చేయబడింది. ఈ స్టేషన్ ని 1901 నుండి 1903 కాలం లో నిర్మించారు.

Video Advertisement

అయితే దీని నిర్మాణం వెనుక ఆస్తకికర అంశం ఉంది. ఈ స్టేషన్ ని ఆ సమయంలో ఉన్న పెన్సిల్వేనియా, రైల్‌రోడ్ స్టేషన్‌ కి పోటీగా నిర్మించారని సమాచారం. ఆ కాలం లో భారీ యంత్రాలు లేని సమయం లో కూడా దీన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఈ భారీ రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి రెండేళ్లకు పైగా పట్టింది.

know about world's largest railway station.

Grand Central Station!

US మీడియా నివేదికల ప్రకారం.. దీన్ని నిర్మించడానికి ప్రతిరోజూ 10,000 మంది వర్కర్లు పనిచేశారు. ఈ స్టేషన్ దాని పరిమాణానికి మాత్రమే కాకుండా దాని నిర్మాణం, రూపకల్పనకు కూడా ప్రసిద్ధి చెందింది. స్టేషన్‌లో మొత్తం 44 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇక్కడ ఏకకాలంలో 44 రైళ్లు ఆగుతాయి. ఈ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌లో చాలా సినిమాల షూటింగ్ జరిగింది.

ఇక భారత్‌ నుంచి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో స్టేషన్లు ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫామ్‌ ఉన్న స్టేషన్ల విషయానికొస్తే టాప్‌ 10లో అత్యధిక స్టేషన్లు భారతదేశానికి చెందినవే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌పూర్‌. ఇక్కడ ప్లాట్‌ ఫాం పొడవు 1366.33 మీటర్లు (4483 అడుగులు). అలాగే దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ టైటిల్‌ను ఉత్తర ప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ నమోదు చేసింది. రైల్వే స్టేషన్ గుండా కనీసం 3 మార్గాలు ఉన్న ప్రదేశాలను జంక్షన్‌లు అంటారు.

అలాగే అమెరికా విషయానికి వస్తే దాదాపు రెండున్నర లక్షల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్స్ ఉన్నాయి. అయితే వీటిలో ప్రయాణికుల కోసం వాడేవి  35 వేల కిలోమీటర్లు మాత్రమే. అమెరికా లో రైలు ప్రయాణం పై ప్రజలు ఎక్కువగా ఆధార పడకపోవడమే దీనికి కారణం. ఎక్కువ శాతం సరకు రవాణా కోసమే వాడుతుంటారు. ఆమ్ ట్రాక్ సంస్థ 46 రాష్ట్రాల్లో రోజుకు 300 రైళ్లు నడుపుతోంది.


End of Article

You may also like