Ads
కొందరు అర్ధరాత్రి దాటాక, తెల్లవారుతుండగా వచ్చే మూడవ ఝాము అత్యంత అశుభమైన దానిగా భావిస్తుంటారు. రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉన్న సమయాన్ని మూడవ ఝాము అని లేదా మూడవ గడియారం అని అంటుంటారు.
Video Advertisement
అయితే ఈ సమయాన్ని కొందరు అశుభంగా భావించడానికి కారణమేంటి? అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం. ప్రపంచ దేశాలలో చాలా మతాలు, సంస్కృతులు ఈ సమయాన్ని అశుభంగానే భావిస్తున్నాయి.
ఎక్కువగా ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దెయ్యాలు ఉన్నత స్థితిలోనూ, మానవులు బలహీనంగా ఉంటారట. ఉన్నట్లుండి మెలకువ రావడం, చెమటలు పడుతుండడం, గుండె చప్పుడు ఎక్కువగా ఉండడం, కాళ్ళు, చేతులు చల్ల బడడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయట.
అందుకే ఈ సమయాన్ని కొందరు మరణ సమయంగా పరిగణిస్తుంటారు. అయితే, దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. వైద్య శాస్త్రం ప్రకారంగా కూడా ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో ఉబ్బసం వచ్చే అవకాశం 300 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో అడ్రినలిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ విడుదల అవడం తగ్గిపోతుంది. అందుకే ఆ సమయంలో ఇటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఉదయం సమయంతో పోలిస్తే తెల్లవారు జామున 3 గంటల నుంచి 4 గంటల వరకు సమయంలో రక్తపోటు అధికంగా ఉంటుంది. ఉదయం 6 గంటల సమయంలో కార్టిసాల్ హార్మోన్ వేగంగా విడుదల అవడం వలన రక్తం గడ్డ కట్టి, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని వైద్య నిపుణుల అభిప్రాయం. ఈ కారణాల వల్లే రాత్రి 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్న సమయాన్ని అశుభ సమయంగా పేర్కొంటున్నారు.
End of Article