ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన “అన్నం” తింటున్నారా.? అయితే ఈ సమస్యలని కొని తెచ్చుకున్నట్టే..!

ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన “అన్నం” తింటున్నారా.? అయితే ఈ సమస్యలని కొని తెచ్చుకున్నట్టే..!

by Anudeep

Ads

ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద నిదానంగా బొగ్గులు పోగేసి అన్నం వండేవారు. ఆరోజుల్లో మూడు పూటలా అన్నం తిన్నవారు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ.. ప్రస్తుతం గ్యాస్ పొయ్యి అందుబాటులోకి వచ్చినా కూడా.. అందులో వండడానికి ఎవరికీ సమయం ఉండడం లేదు.

Video Advertisement

ఉరుకుల పరుగుల జీవితంలోకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వచ్చింది. ఫాస్ట్ గా వండేయడమే కాకుండా.. మధ్యలో వెళ్లి చూడాల్సిన అవసరం లేకుండా ఉండడంతో చాలా మంది రైస్ కుక్కర్లకె ఓటు వేస్తున్నారు.

electric cooker 1

అయితే.. ఈ రైస్ కుక్కర్లతో వండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయో ఎవరు గమనించుకోవట్లేదు. అసలు ఆహరం వండడం అనేది ఓ ప్రక్రియ. ఆహరం వండేటప్పుడు గాలి, వెలుతురూ తగులుతూ ఉండాలి. అటువంటి ఆహరం రుచిగాను ఉంటుంది మరియు ఆరోగ్యం కూడా లభిస్తుంది. కానీ, రైస్ కుక్కర్ లో వండేటప్పుడు వెలుతురూ, గాలి వంటివి తగలవు.

electric cooker 2

ఇక రైస్ కుక్కర్ పాత్రలు ఎక్కువగా అల్యూమినియంవే వస్తున్నాయి. ఇటువంటి పాత్రలలో వండిన ఆహారపదార్ధాలు తినడం వలన అనేక రోగాల బారిన పడుతుంటాము. అయితే.. ఈ ఇబ్బందులు ముందే తెలియకపోయినా.. క్రమంగా కొన్ని సంవత్సరాల తరువాత వెలుగులోకి వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఉదర సంబంధ సమస్యలు, గుండె సమస్యలు, మధుమేహం, గ్యాస్ సమస్యలు, కీళ్ల వాతం, నడుము నొప్పి, అధిక బరువు వంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

electric cooker 3

అలాగే.. అల్యూమినియం పాత్రలలో వండేటప్పుడు వాటిల్లో పుల్లటి పదార్ధాలు, ఆసిడ్ కలిగిన పదార్ధాలను ఉంచకపోవడమే మంచిది. అలాగే.. వీటిల్లో ఫ్రై లాంటివి వండకూడదు. అలాగే పూర్తి అల్యూమినియం పాత్రలు కాకుండా.. ఎనోడైజ్డ్ అల్యూమినియం కలిసిన వంట పాత్రలైతే కొంతవరకు మేలు అని నిపుణులు చెబుతున్నారు.


End of Article

You may also like