వరల్డ్‌కప్ గెలిచిన టీమ్స్ “7” సార్లు ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అయ్యాయి… గమనించారా.?

వరల్డ్‌కప్ గెలిచిన టీమ్స్ “7” సార్లు ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అయ్యాయి… గమనించారా.?

by Mohana Priya

Ads

దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్ కి మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా టీ20 కప్‌ గెలవడం ఇదే మొదటిసారి.

Video Advertisement

 

ఇప్పటివరకు వెస్టిండీస్ తప్ప మిగిలిన ఏ జట్టు కూడా రెండు సార్లు కప్ గెలవలేదు. అయితే, మ్యాచ్ జరగకముందే విన్నర్ ఆస్ట్రేలియా అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి కారణం ఏంటంటే.

left side sentiment in world cup finals

# 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ లో టీమిండియా, శ్రీలంక జట్లు పోటీ పడ్డాయి. అప్పుడు టీమిండియా విజయం సాధించింది. ఇందులో ట్రోఫీకి ధోనీ ఎడమవైపు నిల్చున్నారు.

left side sentiment in world cup finals

# 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తలపడ్డాయి. ఇందులో ఎడమవైపున మైకెల్‌ క్లార్క్‌ నిల్చున్నారు. ఇందులో కూడా ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది.

left side sentiment in world cup finals

# 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ పోటీ పడ్డాయి. ఇందులో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న డారెన్‌ సామి టైటిల్ విజేతగా నిలిచారు.

left side sentiment in world cup finals

# 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ లో పాకిస్తాన్‌, టీమిండియా పోటీ పడ్డారు. ఇందులో ట్రోఫీకి ఎడమవైపు నిల్చున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ విజేతగా నిలిచారు.

left side sentiment in world cup finals

# 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ లో ట్రోఫీకి ఎడమవైపు నిలుచున్న ఇయాన్‌ మోర్గాన్‌ విజయం సాధించారు.

left side sentiment in world cup finals

# 2021లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న కేన్‌ విలియమ్సన్‌ గెలుపొందారు.

left side sentiment in world cup finals

అంటే ట్రోఫీకి ఎడమవైపు నిలుచున్న జట్టు విజయం సాధిస్తోంది. ఇదే విధంగా మ్యాచ్ జరగకముందే ఆస్ట్రేలియా కూడా విజయం సాధిస్తుంది అని నెటిజన్లు చెప్పేశారు. వినడానికి వింతగా ఉన్నా కూడా, చాలా సార్లు ఈ విషయం నిజం అవ్వడంతో సోషల్ మీడియా మొత్తం దీని గురించే చర్చ నడుస్తోంది.


End of Article

You may also like