“ఏయ్ బంటి నీ సబ్బు స్లోనా ఏంటి?” ఆ యాడ్ గుర్తుందా? ఆ యాడ్లో నటించిన ఆ అమ్మాయి గుర్తుందా. ఆ అమ్మాయే అవనీత్ కౌర్ .ఆ చిన్నమ్మాయి ఇప్పడు నటిగా మారి తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది.చైల్డ్ ఆర్టిస్టులంతా వారి వారికి నచ్చిన ప్రొఫెషన్స్ లో స్థిరపడితే , సినిమా రంగాన్నే తమ కెరీర్ గా మార్చుకునేవాళ్లు కొందరు.వారి కోవలోకి వస్తుంది అవనీత్ కౌర్. ఏంటి ఈ అమ్మాయి ఇంత పెద్దయిపోయింది అని ఆశ్చర్యం కలిగిస్తోంది.

చిన్నపిల్లలు ఎంత త్వరగా పెద్దవుతారో అర్దం కాదు. మరీ ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు . అంజలి సినిమాలో షాలిని కానీ, తేజ చిత్రంలో తరుణ్ కానివ్వండి వాళ్లు హీరో హీరోయిన్లైనప్పటికి వాళ్ల చిన్నప్పటి ముద్దు ముద్దు ముఖాలే కళ్లముందు కదులుతుంటాయి.

అవనీత్ కౌర్ కూడా అంతే,  డ్యాన్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ ప్రోగ్రామ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది అవనీత్ . తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో టివి సీరియల్స్ లో, టివి షోస్ లో నటించింది. లైఫ్ బాయ్, మాగి , హిందుస్తాన్ లివర్ వారి యాడ్స్ లో మొత్తానికి 40కి పైగా యాడ్స్ లో నటించింది.

ఇటీవల చంద్రనందిని సీరియల్లో అవనీత్ నెగటివ్ రోల్ పోషించింది. ఇదే సీరియల్లో శ్వేతా బసు ప్రసాద్ కథానాయికగా నటించింది. ఈ సీరియల్ ఇటు శ్వేతకి, అటు అవనీత్ కౌర్ కి ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది.  అవనీత్ కౌర్ విలన్ క్యారెక్టర్ చేయడంతో తన నటనలోని మరోకోణాన్ని చూపించడమే కాదు, ఏ పాత్రనైనా తను ఈజీగా నటించగలదు అనిపించేలా చేసింది.

2014లో వచ్చిన రాణి ముఖర్జి చిత్రం మర్దాని తో వెండి తెరకు కూడా పరిచయం అయింది అవనీత్ . నటిగా మరింత పేరు తెచ్చుకోవాలనేదే తన కోరిక అని చెప్పే అవనీత్ కౌర్ ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్. ఇన్స్టాగ్రాం లో ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగడమే దీనికి ఉదాహరణ. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్లో ఎప్పటికప్పుడు తన ఫోటోస్ ని అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఆ అమ్మాయేనా ఈ అమ్మాయి అని అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Sharing is Caring:
No more articles