LION vs TIGER: సింహం – పులి పోటీపడితే ఏది గెలుస్తుంది.? ఈ 7 ఆసక్తికర విషయాలు చూడండి.!

LION vs TIGER: సింహం – పులి పోటీపడితే ఏది గెలుస్తుంది.? ఈ 7 ఆసక్తికర విషయాలు చూడండి.!

by Mohana Priya

Ads

మనకి క్రూర మృగాలు అంటే ముందుగా గుర్తొచ్చేది సింహం, ఇంకా పులి. అయితే మనలో చాలా మంది సింహం ,పులి కేవలం చూడడానికి మాత్రమే వేరేగా ఉంటాయి, కానీ వాటి గుణాలు ఒకటే అని అనుకుంటాం. కానీ సింహంకి, పులికి చాలా తేడాలు ఉన్నాయి. అంత క్రూరమైన రెండు జంతువులు తలపడితే ఎవరు గెలుస్తారో తెలుసా? ఒకవేళ సింహం పులి తలపడితే ఎవరు గెలుస్తారో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

Difference between lion and tiger

# సింహాలు అడవిలో 12 నుండి 18 సంవత్సరాల వరకు బతుకుతాయి. జూ లో 24 సంవత్సరాల వరకు బతుకుతాయి. పులులు అడవిలో 10 నుండి 12 సంవత్సరాల వరకు బతుకుతాయి. జూ లో అయితే 25 సంవత్సరాల వరకు బతుకుతాయి.

Difference between lion and tiger

# సింహం శరీరంలో 60 శాతం వరకు కండ (మజిల్) ఉంటుంది. పులి శరీరంలో 60 నుండి 70 శాతం వరకు కండ ఉంటుంది.

Difference between lion and tiger

# సింహం బరువు దాదాపు 250 కేజీల వరకు ఉంటుంది. భారతీయ పులి దాదాపు 395 కేజీల వరకు ఉంటుంది.

Difference between lion and tiger

# సింహాల్లో, ఆడ సింహాలు ఎక్కువగా వేటాడుతాయి. అది కూడా గుంపుగా వేటాడుతాయి. పులి రాత్రిపూట ఒక్కతే వెళ్లి వేటాడుతుంది. సింహం కంటే పులి మెదడు 25 శాతం పెద్దగా ఉంటుంది.

Difference between lion and tiger

# సింహాలు 3.5 నుంచి 3.9 అడుగుల ఎత్తు ఉంటాయి. పులులు 2.3 నుంచి నాలుగు అడుగుల ఎత్తు దాకా ఉంటాయి.

Difference between lion and tiger

# సింహానికి 3.2 ఇంచుల కోరలు ఉంటాయి. సింహం దవడ చాలా బలంగా ఉంటుంది. 60 psi ప్రెషర్ తో కొరుకుతాయి. పులులకి పెద్ద నోరు ఉంటుంది. వాటి కోరలు 3.6 ఇంచుల వరకు ఉంటాయి. పులులు 1000 psi ప్రెషర్ తో కొరుకుతాయి.

Difference between lion and tiger

# సింహం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. పులులు గంటకి 64 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి.

ఇదంతా చూసిన తరువాత మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఒకవేళ ఆ రెండు జంతువులు తలపడితే పులే గెలుస్తుంది.


End of Article

You may also like