Ads
పెళ్లి అనేది ఎవరికైనా ముఖ్యమైన ఘట్టమే. తమ జీవితాన్ని పంచుకోబోయే వారిని ఆహ్వానిస్తూ.. కుటుంబ సభ్యులందరి సమక్షం లో చేసుకునే అందమైన వేడుకే పెళ్లంటే. పెళ్లి అనగానే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. ఇద్దరినీ ఇరు కుటుంబాల వారు అందం గా ముస్తాబు చేస్తారు.
Video Advertisement
అసలు కళ అంత వారి కళ్ళలోనే ఉందా అన్నట్లు ఉంటుంది. పెళ్లి ఘడియల ముందు.. పెళ్లికూతురు మోములో సిగ్గు.. అబ్బాయి కళ్ళలో ఆనందం.. ఇవే కదా అసలు పెళ్లి వేడుకకు సందడి తీసుకొచ్చేది.
అయితే ఇప్పటి యువత మాత్రం ఇటువంటి పెళ్లి వేడుక అంటే ముఖం చాటేస్తోంది. క్రమంగా సహజీవనం అనే కల్చర్ మన దేశంలో కూడా వ్యాపిస్తూ వస్తోంది. ఆడంబరంగా ఖర్చులు చేస్తూ పెళ్లిళ్లు చేసుకోవడం మొదలయ్యాక.. చాలా మందికి పెళ్లి అంటే అసలు అర్ధం ఏంటో తెలియకుండా పోయింది. దీనివల్ల పెళ్లిలో చేయించే వైదిక కర్మల అర్ధాలు ఎవరికీ తెలియడం లేదు. ఇంత ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది.. తాము ప్రేమించిన వారితో ఎంజాయ్ చేస్తున్నాం కదా అనే ఉద్దేశ్యంతో చాలా మంది యువత సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నారు.
కానీ, వివాహంలో జరిపే వైదిక కర్మల వెనుక చాలా అర్ధాలు ఉన్నాయి. కొత్తగా జీవితం ప్రారంభించబోయే వధూవరుల జీవితాల్లో అభివృద్ధి ఉండాలని, వారి మనోవాంఛలకు తగ్గట్లు వారి జీవితం సాగుతూ ఉండాలని, వారి మధ్య బంధం బలపడాలనే ఉద్దేశ్యంతోనే ఈ సంప్రదాయాలను పాటించేలా చేస్తారు. ఇక.. వారికి మంచి సంతానం కలగాలన్న సదుద్దేశ్యంతోనే సంప్రదాయాన్ని అనుసరించి.. ముహూర్తం పెట్టి ఆ జంటని ఒక్కటి చేస్తారు. కానీ, ఇవేమీ పట్టించుకోని నేటి యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో సహజీవనం వైపు మొగ్గు చూపుతోంది.
ఇటువంటి కల్చర్ లో తమ జీవితాన్ని పంచుకోవడానికి వచ్చేవారిని చుట్టూ పక్కల వారికి పరిచయం చేయాలన్నా ఇబ్బంది పడే పరిస్థితిని ఎదుర్కొంటు ఉంటారు. ఇక వీరికి పుట్టే సంతానం కూడా మొండిగా, బంధాలకు విలువ ఇవ్వకుండా పెరుగుతూ ఉంటారు. దీనివల్ల రాబోయే సమాజంలో కూడా సత్సంబంధాలు కరువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే భారతీయులు వివాహ బంధానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చినా ఏళ్ల తరబడి నడుస్తున్న ఈ వివాహ ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నారు.
End of Article