వినాయకుడిని నిమజ్జనం చేయడం వెనకున్న ఈ అసలు ఉద్దేశ్యం తెలుసా.?

వినాయకుడిని నిమజ్జనం చేయడం వెనకున్న ఈ అసలు ఉద్దేశ్యం తెలుసా.?

by Anudeep

Ads

వినాయక ఉత్సవాలు దేశమంతటా ఘనం గా జరుగుతాయి. నవరాత్రులు ఆ విఘ్నేశ్వరుడిని కీర్తించి.. ఆ తరువాత తొమ్మిదో రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో.. సందుకో పందిరి వెలుస్తోంది. అందరు భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎంత పెద్ద విగ్రహం పెడితే.. అంత గొప్ప అన్నట్లు చాలా మంది భావిస్తున్నారు. ఐతే.. సామాజిక బంధాలు బలపడే విధం గా ఇలాంటి వేడుకలను జరుపుకోవడం లో ఆక్షేపణ ఏమి లేదు. అయితే.. ఈ వేడుక తరువాత నిమజ్జనం జరిగే సమయం లోనే చిక్కు వస్తుంది.

Video Advertisement

nimajjanam 3

వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వెనుక ఉండే అసలు ఉద్దేశ్యాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు ఈ సంప్రదాయాన్ని పెద్దలు ఎందుకు పెట్టారు అన్న విషయాన్నీ పట్టించుకోవట్లేదు. నిజానికి వినాయక చవితి భాద్రపద మాసం లో వస్తుంది. ఈ మాసం లో వర్షాలు ఎక్కువ గా కురిసే అవకాశం ఉంటుంది. దానివలన నదులు, వాగులలోని నీరు పొంగి పొరలుతుంది. అలాంటి సమయం లో మట్టి తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నదుల తీరాల వెంబడి నిమజ్జనం చేయడం వలన ఆ ప్రాంతం లో మట్టి కరిగి నీరు పొందకుండా అడ్డుకుంటుంది.

vinayak nimajjanam 2

వర్షాకాలం లో క్రిమికీటకాల బెడద కూడా ఎక్కువ గానే ఉంటుంది. కానీ, వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయం లో.. పత్రీ ని కూడా నీటిలోనే వదిలేస్తాము. వినాయక పూజ కు వినియోగించే పత్రి వలన కలిగే లాభాలేంటో ఆయుర్వేదం లో కూడా చెప్పబడింది. ఈ పత్రి వలన నీటిలోని క్రిమికీటకాలు కూడా నశించి నీరు పరిశుభ్రం గా మారుతుంది.

vinayak nimajjanam 2

కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే కేవలం ఆడంబరం కోసమే వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మట్టి బొమ్మల కంటే సున్నం, సిమెంట్ తో చేసిన బొమ్మలే ఎక్కువ గా దర్శనమిస్తున్నాయి. వీటికి మరింత హానికరమైన రంగులను అద్దుతున్నారు. ఫలితం గా నీరు మరింత అపరిశుభ్రం అవుతోంది. ప్రకృతిని కాపాడుకోవడం, భక్తి తో పూజించడం వంటి లక్ష్యాలను పక్కకు నెట్టేసి.. సంప్రదాయాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యం లో భవిష్యత్ లో ప్రమాదం వచ్చే అవకాశాలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి.


End of Article

You may also like