Ads
రహదారులన్నాక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా యాక్సిడెంట్ బారిన పడాల్సి వస్తూ ఉంటుంది.
Video Advertisement
ఇక ఎక్కువగా మలుపులు ఉన్న హై వే ల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి రోడ్లలో గాజువాక నుంచి విశాఖపట్నం వెళ్లే హై వే కూడా ఒకటి.
ఈ రహదారిపై చాలా ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆ రోడ్ పై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. విశాఖ పట్ణణానికి చెందిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆ రోడ్ పైనే ఉంటాయి. 1993 – 95 మధ్య కాలంలో ఆ రోడ్ లో ప్రతి రోజూ ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. అక్కడికీ, ప్రభుత్వం చాలా జాగ్రత్తలే తీసుకుంది. ఆ యాక్సిడెంట్లని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్నో హెచ్చరికల బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. కానీ, యాక్సిడెంట్లు మాత్రం ఆగలేదు. అయితే.. ఓ స్వామిజి ఇచ్చిన సలహా ప్రకారం.. అక్కడి స్థానికులంతా కలిసి చందాలు వేసుకుని ఓ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తరువాత యాక్సిడెంట్లు క్రమంగా తగ్గిపోయాయి.
ఆంజనేయ స్వామి వారే అక్కడి ప్రమాదాలను నివారించారని స్థానికులు బలంగా నమ్ముతారు. కొంచం తర్కం ఆలోచిస్తే.. ఆ రోడ్ పై వెళ్లే వాహనాలను నడిపే డ్రైవర్లలో చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడగానే.. బండి కొంచం స్లో చేసి.. ఆయనకు దణ్ణం పెట్టుకుని వెళ్లేవారు. దీనితో సహజంగానే అక్కడ ప్రమాదాలు తగ్గిపోయాయి. అందుకే హై వే లపై పెద్ద పెద్ద ఆంజనేయ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. దూరం నుంచే డ్రైవర్లకు కనిపించే విధంగా ఈ విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మనకి భగవంతుడిపై భక్తి ఉంటె.. ఆ భక్తే మహత్యాలు చేయగలదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ.
End of Article