కలియుగం గురించి “శ్రీకృష్ణుడు” చెప్పిన 4 సత్యాలు..! అసలు ఏం జరగబోతోంది..?

కలియుగం గురించి “శ్రీకృష్ణుడు” చెప్పిన 4 సత్యాలు..! అసలు ఏం జరగబోతోంది..?

by Anudeep

Ads

హిందూ ధర్మ గ్రంథాలలో అత్యంత భయానక యుగంగా కలియుగం గురించి వివరించబడి ఉంది. కలియుగం అనేది ఒక కారాగారం వంటిదని, పూర్వజన్మలో పాపాలు చేసినవారు తమ పాప ఫలాన్ని అనుభవించడానికి కలియుగంలో పుడతారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కలియుగంలో దుఃఖం అనేది లేకుండా పరిపూర్ణంగా ఆనందంగా జీవించే ఒక్క మానవుడు కూడా కనిపించాడట.

Video Advertisement

రాబోయే కలియుగం రోజులతో పోలిస్తే మనం ఉన్న పరిస్థితులు వందరెట్లు మంచి స్థితిలో జీవిస్తున్నామని  చెప్పవచ్చు. అంటే రాబోయే ముందు ముందు రోజులు అంత భయంకరంగా ఉండబోతున్నాయి. మన భగవాన్ శ్రీ కృష్ణుడు మహాభారత కాలంలో రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో అన్నది అభివర్ణించారు. ఇప్పుడు కలియుగంలో రాబోయే రోజులు ఎలా ఉండబోతుందో అనేది మనం తెలుసుకుందాం..

Lord krishna

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత పాండవులు అందరికీ ఈ కలికాలం ఎలా ఉండబోతుందో కలుసుకోవాలనే ప్రశ్న తలెత్తింది. ధర్మరాజు లేని సమయంలో భీమ, అర్జున, నకుల సహదేవులు తమకు వచ్చిన సందేహాన్ని తీర్చుకోవడానికి కృష్ణభగవాన్ వద్దకు వెళతారు. కలియుగం ఎలా ఉండబోతుందో తెలియజేయండి అంటూ కృష్ణ భగవాన్ ని అడుగుతారు.

Arjuna

దానికి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి, నాలుగు బాణాలను సంధించి నాలుగు దిశలుగా వదిలి వాటిని తీసుకురమ్మని పాండవులతో ఆదేశిస్తారు. పాండవులు నలుగురు ఆ బాణాలు వెతుకుతూ అడవులలోకి వెళ్ళిపోతారు.

#1. మోసం చేయటం :

మొదటగా అర్జునుడి ఒక బాణం దొరుకుతుంది. ఆ బాణం తీసుకునే ప్రదేశంలో అర్జునుడికి ఒక మధురమైన గానం వినిపిస్తుంది. ఈ మధురమైన గానం ఎక్కడి నుంచి వస్తుందో అని అర్జునుడు వెనుతిరిగి చూస్తాడు. ఒక కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న  కుందేలును పొడుచుకు తింటూ కనిపిస్తుంది.

అది చూసిన అర్జునుడు, “ఏంటి ఈ వింత దృశ్యం, సాక్షాత్తూ సరస్వతీ దేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది?” అంటూ ఆశ్చర్యపోతాడు అర్జునుడు. వెంటనే తనకు కలిగిన సందేహాన్ని కృష్ణభగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. సరస్వతీ దేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైనవారు తమ జ్ఞానాన్ని సక్రమంగా సద్వినియోగం చేయకుండా  కాకుండా.. అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయ మాటలు చెబుతూ దోచుకుంటారు అని, రాబందుల్లా వాళ్లను పీక్కు తింటారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు.

#2 దోచుకోవటం :

అదేవిధంగా  భీముడు వెతికిన బాణం ఉన్నచోట భీమునికి ఐదు బావులు కనిపిస్తాయి. ఈ ఐదు బావులలో నాలుగింటిలో నిండుగా నీరు ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఉన్న బావిలో ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. కే నేలపై ఉన్న ఈ 5 బావుల్లో ఇదేం తేడా అంటూ దేవుడు తన సందేహాన్ని కృష్ణుడు తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు శ్రీ  కృష్ణుడు వెల్లడిస్తాడు.

#3. అధిక ప్రేమ చూపటం :

ఇక నకులుడుకి బాణం దొరికిన చోట ఒక ఆవు దూడ పై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే ఆ ఆవును నాకడం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. దానితో నకులుడుకి, “ఏంటి ఈ విపరీతమైన ప్రేమ?” అని సందేహం మొదలవుతుంది. ఇదే ప్రశ్న శ్రీకృష్ణుని అడగగా, “యుగంలో రానురాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారుచేస్తుంది. వాళ్ళ చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారై భూమికి భారంగా మారతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోక ముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు.  ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్య మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి” అని నకులుడుకు సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు..

#4. విచక్షణ కోల్పోవడం :

ఇక చివరివాడైన సహదేవుడుకి తనకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం చూశాడు. ఆ బండరాయి బరువుకి వేగానికి అడ్డు వచ్చిన పెద్దపెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరికి రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు సహదేవుడు. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపడం సైతం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యం అయిందని ఆశ్చర్యపడుతూ ఏంటి ఈ వింత అనే తనకొచ్చిన సందేహాన్ని కృష్ణుడికి చెప్పాడు. ఆ దేవుడు ప్రశ్నకు కృష్ణుడు ఈ విధంగా  సమాధానమిచ్చాడు. కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణం అవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికార బలం ధన బలం ఇవేమీ అతని పతనానికి ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడు కాపాడుతుంది.

కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి, దయ లేకుండా, అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతునిని నమ్మే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టగొడుగుల్లా పెరుగుపోతుంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు. అంటూ కలియుగంలో జరగబోయే నాలుగు సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు.


End of Article

You may also like