Home Mythology ఈ రాశుల వారికి ప్రేమించిన వారితో విడిపోతే ఏమి జరుగుతుందో తెలుసా…?

ఈ రాశుల వారికి ప్రేమించిన వారితో విడిపోతే ఏమి జరుగుతుందో తెలుసా…?

by Anudeep

ప్రేమ కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనకు నచ్చిన వారిని ప్రేమించడం.. వారితో జీవితాన్ని పంచుకోవాలని అనుకోవడం సహజమే. అయితే.. ఇది అందరి విషయంలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కోసారి అవతలివారు మన ప్రేమను అంగీకరించవచ్చు. ఒక్కోసారి అది కూడా కుదరకపోవచ్చు.

కొన్నిసార్లు ప్రేమ విఫలం అవ్వొచ్చు. మనకు ఇష్టమైన వారు కేవలం మాజీగా మిగిలిపోవచ్చు. అయితే బలీయమైన ప్రేమ కలిగిన వారు తిరిగి తమ మాజీలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే.. ఏ ఏ రాశుల వారు ఇలా చేస్తారో.. ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

తులా:

tula rasi
వీరు తొందరగా కఠినమైన నిర్ణయాలు తీసుకోలేరు. చాలా దయ కలిగి ఉంటారు. వీరు తమ మాజీలు ప్రతికూల అలవాట్లని మార్చుకుంటారని.. తిరిగి తమకు దగ్గరవుతారని భావిస్తారు.

కర్కాటకం:

karkataka rasi
వీరు ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. వీరు ప్రేమించిన వారికి క్షణకాలమైన దూరంగా ఉండడానికి ఇష్టపడరు. వీరికి ప్రేమ తప్ప ఇంకేమి అక్కర్లేదు. మాజి కోసం రాజీ పడడానికి కూడా సిద్ధపడతారు.

కన్య:

kanya rasi
వీరు చాలా మొండిగా ఉంటారు. తప్పులు చేసినా.. వాటి నుంచి ఏ పాఠాన్ని నేర్చుకోరు. వీరు ఆప్యాయత కోసం అర్రులు చాస్తారు. అమూల్యమైన ప్రేమ భరితమైన క్షణాలను తిరిగి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

వృషభం:

vrushabha rasi

వీరు ఎవరినైనా ఇష్టపడితే వారికి సర్వస్వాన్ని ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ ప్రేమ విఫలం అయితే.. వీరి హృదయం ముక్కలవుతుంది. తిరిగి ఆ ప్రేమను దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.

మీనం:

meena rasi
వీరు లైఫ్ పట్ల సానుకూల దృక్పధాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా మాజీల గురించే ఆలోచిస్తారు. ఏ అవకాశం ఉన్నా తిరిగి వారితో కలిసిపోవాలని అనుకుంటారు. అయితే.. వీరి సున్నిత స్వభావం వలన తరచుగా వీరి హృదయం గాయపడుతుంది.

You may also like