Ads
Sports Adda

“చికిత్స కోసం వెళ్లి నర్స్ తో ప్రేమ”…”కేన్ మామ” లవ్ స్టోరీ సినిమా రేంజ్ లో ఉందిగా.?

Published by
Lakshmi Bharathi

న్యూజిలాండ్ మెన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మనందరికీ సుపరిచితుడే. బ్యాట్ పట్టుకుంటే బాదడమే కాదు ఓటమి ఎదురైనా నిగ్రహం గా ఎదుర్కోగల సమర్ధుడు మన కేన్ మామ. అతని నాయకత్వ పటిమ, టీం కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టైం లో అతని నిలకడ ను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది.

విలియమ్సన్ 303 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 15,107 పరుగులు చేశాడు. రాస్ టేలర్ (17996) మరియు స్టీఫెన్ ఫ్లెమింగ్ (15289) తర్వాత అతను తన జట్టుకు అత్యధిక పరుగులు చేసిన మూడవవాడు గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 37 సెంచరీలు, 84 అర్ధ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించుకున్నాడు. కేవలం ప్రతిభ మాత్రమే కాదు.. కేన్ ఎంత ఒత్తిడి లో అయినా ప్రశాంతత ను చూపించగలడు. 2019 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి సమయం లో కూడా కేన్ మామ తన ముఖం పై చిరునవ్వును చెరగనివ్వలేదు.

అందుకే అతనికి ప్రపంచ వ్యాప్తం గా అభిమానులున్నారు. కేన్ విలియమ్సన్ కు ఇప్పుడు ముప్పై ఏళ్ళు. తన భార్య సారా రహీం తో కలిసి జీవిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లోనే సారా పండంటి ఆడబిడ్డను ప్రసవించారు. కేన్ విలియమ్సన్ లానే, సారా కూడా సోషల్ మీడియా లో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. చాలా నిలకడ గా ఉంటారు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్ లో ఉంటుంది. ఆమెకి కేవలం 200 ల ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు.

అసలు వీరి లవ్ స్టోరీ నే చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. సారా ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో జన్మించారు. ఆ తరువాత ఆమె న్యూజిలాండ్ కు షిఫ్ట్ అయ్యారు. ఆమె నర్స్ గా పని చేసేవారు. తాను పని చేస్తున్న ఆసుపత్రికి ఓ సారి కేన్ విలియమ్సన్ చికిత్స కోసం వచ్చారు. ఆ సమయం లోనే వారిద్దరూ తోలి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని, డేటింగ్ కూడా చేసారు.


Published by
Lakshmi Bharathi

Recent Posts

  • Bigg Boss 5 telugu

బిగ్‌బాస్ రహస్యాలని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సరయు.! (వీడియో)

సరయు బిగ్‌బాస్ షోలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు. మొదటి వారం తన పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు అందరూ… Read More

51 mins ago
  • Off Beat

1p/sec తో టెలికాం రంగంలో రెవల్యూషన్ తీసుకొచ్చిన “టాటా డొకోమో”…ఎందుకు సడన్ గా క్లోజ్ అయ్యింది.?

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది… Read More

2 hours ago
  • Bigg Boss 5 telugu

Bigg Boss Telugu-5 : షన్నుకి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. ఇవాళ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన… Read More

3 hours ago
  • Filmy Adda

“జెర్సీ” సినిమాలో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో..? ఎప్పుడైనా గమనించారా?

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా… Read More

5 hours ago
  • Filmy Adda

మీడియా కి నాగ చైతన్య వార్నింగ్ ఇలా వింటేనే మీతో ఇంటర్వ్యూ లు అంటూ షరతు ..!

అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతల పైన వ్యక్తిగత జీవితం పైన గతి కొన్ని రోజులుగా మీడియా లో వస్తున్న… Read More

5 hours ago
  • Bigg Boss 5 telugu

బిగ్‌బాస్ ప్రియ కూతురి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..! చనిపోయే రెండు రోజుల ముందే..?

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు శైలజ… Read More

6 hours ago
Ads