Home Mythology మకరరాశిలో కలవనున్న 5 గ్రహాలు.. మార్చిలో ఈ 4 రాశులకి దశ తిరగబోతోంది.. అవి ఏవంటే?

మకరరాశిలో కలవనున్న 5 గ్రహాలు.. మార్చిలో ఈ 4 రాశులకి దశ తిరగబోతోంది.. అవి ఏవంటే?

by Anudeep

ప్రతి సంవత్సరము కూడా గ్రహాల స్థితిగతులు మారుతూ ఉంటాయి. అయితే రాశుల ఆధారంగా మనం జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక ముందుగానే మనం తెలుసుకుంటే దానికి తగిన పరిష్కారం కూడా చూసుకోవచ్చు.

ఒక్కోసారి మన గ్రహాల బలం బాగుంటే మనకి అదృష్టం పట్టి మహర్దశ నడుస్తూ ఉంటుంది. అయితే.. ఇలాంటివి ముందే తెలుసుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

mesha rasi

ఈ ఏడాది మార్చి నెలలో అరుదైన పంచ గ్రహాలు ఏర్పడనున్నాయి. ఇది ఎంతో యాదృచ్చికంగా జరిగే పవిత్ర కలయిక. దీనివలన పలు రాశుల వారికి శుభం జరగబోతోంది. ఏ ఏ రాశుల వారికి మార్చి నెలలో అదృష్టం పట్టబోతోందో ఇప్పుడు చూద్దాం.

# మేష:

mesha rasi 2
మార్చి నెల పంచగ్రహ యోగంతో ప్రారంభం కానున్న నేపథ్యంలో మేష రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. అలాగే ఉద్యోగం ఉన్నవారికి కొత్త ఉద్యోగం, లేదా ఉన్న ఉద్యోగంలోనే ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.

# వృషభ:

vrushabha rasi

వీరికి ఏ పని తలపెట్టినా అందులో విజయం లభించనుంది. వీరికి కూడా కెరీర్ లో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

# తులా:

tula rasi

ఈ రాశి వారికి జీవితంలో వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి.

# వృశ్చిక :

vruschika-raasi-phalithalu-ee-vaaram-raasi-phalalu

వీరికి కూడా ఈ నెల చాలా లాభాలు కలగనున్నాయి. వీరి ఆదాయం పెరుగుతుంది. ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. వీరి కుటుంబ సభ్యులతో కూడా వీరికి సమయం బాగా గడుస్తుంది.

You may also like