Ads
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ. శాంతియుత మార్గంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. రక్తం చుక్క నేల రాలకుండా దేశానికి స్వాతంత్ర తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. అహింసా మార్గాన్ని అనుసరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచిన భారత జాతీయ ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ. అహింసాయుత నిరసన సూత్రానికి అంతర్జాతీయ ఖ్యాతిని కూడా పొందారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా, మహాత్మా గాంధీ అంకితభావంతో కూడిన సరళమైన సూత్రాలను ఆమోదించింది.
Video Advertisement
మహాత్మా గాంధీ జీవితం స్వతహాగా స్ఫూర్తిదాయకం. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి పోరాటంలో గాంధీజీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే అంతకుముందు వాగ్దానం చేసినట్లుగా బ్రిటిష్ వారు యుద్ధానంతరం స్వాతంత్య్రం ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో ఖిలాఫత్ ఉద్యమం ఫలితంగా ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గాంధీ చేసిన ఉద్యమాలలో సహాయ నిరాకరణ ఉద్యమం చాలా ముఖ్యమైనది. బ్రిటీష్ వారితో సహకారాన్ని నిలిపివేయాలని గాంధీ తన తోటి దేశ ప్రజలను కోరారు. భారతీయుల సహకారం వల్లనే బ్రిటిష్ వారు భారతదేశంలో విజయం సాధించారని ఆయన విశ్వసించారు. ఇలా ఎన్నో పోరాటాల తరువాత భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.
మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రతి వస్తువు ఎంతో అమూల్యమైనది. ఆయన అప్పట్లో పలు సందర్భాల్లో రాసిన లేఖలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన రాసిన లేఖలకు వేలంలో భారీ ధరకు దక్కించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మహాత్మా గాంధీ తన స్వహస్తాలతో గుజరాతి భాషలో రాసిన లెటర్ ఒకటి వైరల్ గా మారింది. చేతితో తయారు చేసిన కాగితం పై గాంధీజీ ఆ లేఖను రాసారు.
ఆ లేఖలో ఏం రాసి ఉంది అంటే..” కుమార్ శ్రీ రంజిత్ సింగ్ గారు, మీ ఉత్తరం నాకు అందింది. మీరు మీ సూచనలను అమలు చేసిన ఫలితం అయిన కాపీ ని చూసాను. నాకు జడేజా జీవన్ సింగ్జీ సమాధానం దొరికింది. అతను మీకు కూడా కాపీ పంపినట్లు తెలుస్తోంది. సర్దార్ లిస్టులో తనని ఉంచే ప్రయత్నం ఫలించనందుకు చింతిస్తున్నాను.” అని గాంధీజీ తన స్వదస్తూరీ తో గుజరాతి లో రాసారు. ఒక రకమైన ఇంకుతో పెద్ద అక్షరాల్లో ఆయన ఈ లేఖను రాశారు. ఆయన సంతకం కూడా ఆ లేఖలో ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు.
End of Article