భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం తెచ్చినవారిలో అగ్రస్థానంలో ఉండేది మహాత్మా గాంధీ. భారతీయులందరు గాంధీజీని ‘జాతిపిత’ గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు మహాత్మా గాంధీ నమ్మే సిద్ధాంతాలు.  సత్యాగ్రహము, సహాయ నిరాకరణ అనే ఆయుధాలతో తెల్లవారిని తరిమికొట్టారు.

Video Advertisement

చేత కర్రబట్టి, కొల్లాయి కట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసిన గాంధీజీ, మతాలూ, కులాలూ అన్ని ఒకటే అని చాటి చెప్పిన మహోన్నతుడు. గాంధీజీ భార్య పేరు కస్తూర్బా గాంధీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గాంధీజీ మరొక మహిళను ప్రేమించారని చరిత్రకారుడు, రచయిత, అయిన రామచంద్ర గుహ తెలిపారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.. చరిత్రకారుడు, రచయిత, అయిన రామచంద్ర గుహను ఒక ఇంటర్వ్యూలో గాంధీజీ ప్రేమించిన మహిళా గురించి అడుగగా, ఆయన మాట్లాడుతూ, సరళా దేవి చౌధురాణి విద్యావేత్త, అభ్యుదయవాది, రాజకీయ కార్యకర్త. ఆమె తన భర్తతో కలిసి లాహోర్‌లో నివసించింది. ఆమె చాలా నిష్ణాతురాలు, కవి, గాయని. ఆమె జాతీయవాద సమావేశాలలో బాగా పాడేది. గాంధీ ఆమె పాడటం విన్నారు, గాంధీజీ ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు. గాంధీజీ 1919లో లాహోర్ వెళ్ళిన సమయంలో సరళా దేవి ఇంట్లో గాంధీ బస చేశారు.
అయితే ఆమె భర్త  స్వాతంత్ర్య, ఉద్యమకారుడు రామ్‌భుజ్ దత్త్ ఆ సమయంలో జైల్లో ఉన్నారు. గాంధీ, సరళల మధ్య చాలా సాన్నిహిత్యం ఉందని అన్నారు. వారిది ప్లాటోనిక్ ప్రేమగా తెలిపారు. అయితే సరళా దేవి రవీంద్రనాథ్ ఠాగూర్ కు మేనకోడలు, సోదరి కుమార్తె. ఉన్నత చదువు పూర్తి చేసింది. 1910 లో భారత స్త్రీ మహామండలాన్ని అలహాబాద్‌లో స్థాపించింది. ఇది ఇండియాలో తొలిమహిళా సంస్థ. స్త్రీ విద్యను ప్రోత్సహించడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి. ఈ సంస్థ దేశంలోని మహిళల స్థితిని మెరుగుపరచడం కోసం ఢిల్లీ, కరాచీ, హైదరాబాద్ వంటి అనేక ప్రాంతాలలో కార్యాలయాలను మొదలుపెట్టింది.

గాంధీజీ లాహోర్ వెళ్ళిన సందర్భంలో సరళాదేవితో  సానిహిత్యం ఏర్పడింది. కానీ వారి సాన్నిహిత్యం లాహోర్‌లో చర్చనీయాంశం అయ్యింది. గాంధీజీ  ఆమె రాసిన రచనలను, కవితలను తన ప్రసంగాలలో, పలు పత్రికలలో వినియోగించాడు. ఖాదీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి గాంధీజీతో కలిసి సరళ దేవి భారత్‌లో పర్యటించారు. దూరంగా ఉన్నప్పుడు ఇద్దరు తరచూ ఉత్తరాల ద్వారా సంప్రదించుకునేవారు.
రవీంద్రభారతి యూనివర్సిటీ ఉప కులపతి, సభ్యసాచి బాసు రే చౌదరి చెప్పిన ప్రకారం, ఇద్దరి మధ్య సన్నిహితమైన బంధం ఉన్నప్పటికీ, అది పరస్పరం మెచ్చుకోవడం మాత్రమే అని తెలుస్తోంది. సరళా దేవి కుమారుడు దీపక్, గాంధీజీ  మనవరాలు అయిన రాధను పెళ్లి చేసుకున్నాడు. గాంధీజీ, సరళాదేవి బంధం గురించి గాంధీజీ  సన్నిహితులకు సైతం తెలుసు. అయితే, కొంత కాలం అనంతరం సరళను గాంధీజీ దూరం పెట్టారు. ఆ తరువాత కొన్నాళ్లకు సరళాదేవి హిమాలయాల్లో ఏకాంతగా గడుపుతూ అక్కడే కన్నుమూసారని తెలుస్తోంది.

Also Read: పాకిస్తాన్ లో 16 ఏళ్లు నరకయాతన పెట్టినా కూడా భయపడలేదు..! దేశం కోసం పోరాడిన ఈ బ్లాక్ టైగర్ గురించి తెలుసా..?